Skip to main content

ADCET 2024: ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదల

ADCET 2024  Art and  Design Common Entrance Test 2024 Notification

కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'ఆర్ట్‌ & డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2024' నోటిఫికేషన్‌‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు వివరాలు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) ఇన్‌ పెయింటింగ్‌/ స్కల్ప్‌చర్‌/ యానిమేషన్‌/ అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ ఫొటోగ్రఫీ. 

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమార ఉత్తీర్ణత ఉండాలి. 
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీలకు రూ.750, ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 22, 2024

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: మే 31, 2024
హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ : జూన్‌ 04, 2024

పరీక్ష తేది: జూన్‌ 13, 2024
వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/ADCET (or)www.ysrafu.ac.in.

Published date : 08 May 2024 05:18PM

Photo Stories