Skip to main content

Monkeypox: డబ్ల్యూహెచ్‌వో(WHO) సీరియస్ హెచ్చ‌రిక‌.. మంకీపాక్స్‌పై అలర్ట్‌గా ఉండ‌కుంటే..?

కరోనా కొత్త వేరియంట్లతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ కొత్త సవాల్‌ విసురుతోంది.
WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచవ్యాప‍్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. 

Monkeypox Cases: మంకీపాక్స్‌ కలకలం.. ల‌క్ష‌ణాలు ఇవే..

మంకీపాక్స్‌ వేగంగా..
మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది.

Monkeypox: మంకీపాక్స్‌ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..

వీరిపై తీవ్ర ప్రభావం.. 
మరోవైపు.. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ.. వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

First Case of Monkeypox in 2022: అమెరికాలో మంకీపాక్స్‌ వైరస్‌ కేసు నమోదు

తెలంగాణ ప్ర‌భుత్వం కూడా..
మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్‌కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Monkeypox రోగులకు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసిన మొదటి దేశం బెల్జియం

దీని ల‌క్ష‌ణాలు ఇవే..
జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్‌ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మంకీపాక్స్ అంటే ఏమిటి..?
స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ కనిపించింది.

ఎలా వ్యాపిస్తుందంటే..?
తుంపర్ల ద్వారా, మంకీపాక్స్‌ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా  సోకుతుంది.

దీనికి చికిత్స ఎలా..?
ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు.

Trivitron Healthcare: మంకీ పాక్స్‌ నిర్ధారణకు కిట్‌ తయారు చేసిన చెన్నై కంపెనీ

Published date : 30 May 2022 03:14PM

Photo Stories