కేంద్రం కీలక సంస్కరణ : ఇకపై ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!
ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
25,000 ఒప్పందాలు తొలగింపు..
"మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు" సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
Union Budget 2022: తగ్గే.. పెరిగే వస్తువులు ఇవే..!
Union Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యమైన అంశాలు ఇవే..
Good News: ట్యాక్స్ కట్టేవాళ్లకు వరాల జల్లులు ఇవే..
Nirmala Sitharaman : ఈ విద్య కోసం 200 ఛానెల్స్.. త్వరలోనే 5జీ..
Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాలు..ప్రణాళిక ఇలా union budget
Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు
Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు
Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు
Union Budget 2022 : ఈ రాష్ట్రాలపైనే కేంద్రం ఫోకస్..!
Nirmala Sitharaman: ఇకపై డిజిటల్ పాస్‌పోర్ట్‌లు.. భద్రత విషయంలో..
Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే
Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?
Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..
Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్..!