Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 26th కరెంట్ అఫైర్స్
National TTలో శ్రీజకు రెండు పతకాలు
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో సెప్టెంబర్ 24న టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక్ సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు.
Also read: Quiz of The Day (September 26, 2022): ‘బ్యూటీ విటమిన్’ అని ఏ విటమిన్‌కు పేరు?
Women's cricket: ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్
ఇంగ్లండ్ జట్టుతో సెప్టెంబర్ 24న జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 3–0తో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇంగ్లండ్ చివరి వికెట్ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖరారైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29). హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 24th కరెంట్ అఫైర్స్
Women Cricket : ముగిసిన జులన్ గోస్వామి కెరీర్
భారత మహిళా క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా జులన్ గోస్వామి గుర్తింపు పొందింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై మోసింది. జనవరి 6, 2002లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జులన్ గోస్వామి.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడడం విశేషం. క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు అందుకున్న ఆమె జీవితం ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం
Also read: Roger Federer Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్విస్ స్టార్
పశ్చిమబెంగాలోని నదియా జిల్లా చక్డా.. జులన్ సొంత గ్రామం. చక్డా నుంచి కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న జులన్.. చిన్నప్పుడు స్కూల్లో, తన ఉరిలో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్‌కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అని అవమానించినప్పటికి క్రికెట్ ఆడాలనే తన పట్టుదలను మాత్రం విడవలేదు.
Also read: 2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు
బాల్‌గర్ల్ నుంచి క్రికెటర్ దాకా
అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో. ఆ ఏడాది కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో జులన్ గోస్వామి బాల్ గర్ల్‌గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. 'భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..' అని మనసులో నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు. అయితే ఆమె నివసిస్తున్న చక్డాలో, నదియాలో క్రికెట్ అకాడమీలు లేవు. క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే 80 కిమీ ఆవల ఉన్న కోల్‌కతాకు వెళ్లాల్సిందే. అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది.
Also read: Iga Swiatek: యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన మొదటి పోలిష్ టెన్నిస్ స్టార్
19 ఏండ్ల వయసులో జులన్ గోస్వామి 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేకపోవడంతో అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో అతి సాధారణ వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్‌లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్.
Also read: Suresh Raina Retires: క్రికెట్‌కు రైనా వీడ్కోలు
లెక్కకు మించి రికార్డులు
భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ జులన్ పేరిటే ఉంది. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే..
Also read: Neeraj Chopra: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం
►వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్.
►జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్.
►మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43
►ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు) రెండో క్రికెటర్.
►అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది. న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది.
►2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ ఒక టెస్టులో పది వికెట్ల (78-10) ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్.
Also read: T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
Federer Retires: ఓటమితో కెరీర్‌ను ముగించిన స్విస్ స్టార్ ఫెడరర్
సింగిల్స్‌లో తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చివరిసారి టెన్నిస్ కోర్టులో బరిలోకి దిగాడు. లేవర్ కప్‌లో భాగంగా ఈ ఇద్దరు దిగ్గజాలు జోడీగా టీమ్ యూరోప్ తరఫున డబుల్స్ మ్యాచ్ ఆడారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్–నాదల్ ద్వయం 6–4, 6–7 (2/7), 9–11తో ఫ్రాన్సెస్ టియాఫో–జాక్ సాక్ (వరల్డ్ టీమ్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Also read: Roger Federer Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్విస్ స్టార్
41 ఏళ్ల ఫెడరర్ తన కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.
NSS Award: కాకతీయ వర్సిటీకి ఎన్‌ఎస్‌ఎస్ అవార్డు.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
2020–2021 సంవత్సరానికి జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. సెప్టెంబర్ 24న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 3 వేర్వేరు విభాగాలలో జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 అవార్డులు లభించాయి. విద్యాసంస్థల కేటగిరీలో తెలంగాణ నుంచి కాకతీయ యూనివర్సిటీ ద్వితీయ స్థానం సాధించగా డాక్టర్ సుంకరి జ్యోతి, వాలంటీర్ కేటగిరీలో శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన కూచూరు మైసూరారెడ్డి అవార్డులు అందుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రోగ్రాం ఆఫీసర్ కేటగిరీలో జేఎన్‌టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వాలంటీర్ కేటగిరీలో నెల్లూరుకు చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన సిరి దేవనపల్లికి అవార్డులను ప్రదానం చేశారు.
TS లోని 16 పురపాలికలకు Swach Sarveskhan Awards
రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్ రేటింగ్ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు.
Also read: Telangana: సర్వ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో తెలంగాణ దేశంలోనే.. నంబర్ వన్
అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే..
ఆదిభట్ల, బడంగ్‌పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్‌కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ.
AP: ఆకట్టుకుంటున్న RBK చానల్
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్ విశేష ఆదరణతో దూసుకుపోతోంది. రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది.
Also read: Central Rural Development Department: ముఖరా(కె).. అవార్డులన్నీ ఆ ఊరికే..
శాస్త్రవేత్తలతో సందేహాల నివృత్తి..
ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్ సెంటర్)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ చానల్ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చానల్ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్‌షిప్ లభించింది. రైతులు ఈ చానల్ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్‌ను కూడా సాధించింది.
Also read: TS SERPకు జాతీయ స్థాయిలో గుర్తింపు
అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి
ఆర్బీకే చానల్ అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది. నీతి ఆయోగ్, ఐసీఏఆర్ తదితర జాతీయ సంస్థతో పాటు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్‌ఏవో సహా వివిధ దేశాల ప్రముఖులు ఈ చానల్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ చానల్ కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చానల్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది.
Also read: Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు
Queen Elizabeth Award: భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో సెప్టెంబర్ 24న జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్‌మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్‌లో జని్మంచారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు.
Also read: Teachers Day 2022 Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ గుర్తింపు
New technology: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్‌ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్‌ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్‌ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్‌పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు.
Maa Robot: దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో
ఆయన పేరు బిపిన్ కదమ్. వయసు 40 ఏళ్లు. ఉండేది గోవాలో. పని చేసేది దినసరి కూలీగా. కదమ్‌కు ఓ 14 ఏళ్ల కూతురు. దివ్యాంగురాలు. చేతులు కదపలేదు. తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల క్రితం పూర్తిగా మంచాన పడింది. కదమ్ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. దాంతో కూతురికి వేళకు తిండి తినిపించేందుకు ఏకంగా ఓ రోబోనే తయారు చేసేశాడు కదమ్! ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఎవరి సాయమూ తీసుకోకుండా ఏడాది పాటు తదేకంగా శ్రమించాడు. ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా చివరికి సాధించాడు. ఈ రోబో వాయిస్ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్ రైస్ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు కదమ్. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. కదమ్ ఘనతను గోవా ఇన్నొవేషన్ కౌన్సిల్ ఎంతో మెచ్చుకుంది. కమర్షియల్‌గా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా రోబోను మరింత మెరుగుపరచాలని సూచించింది. అందుకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదే మాదిరిగా నా కూతురు కూడా నాతోపాటు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా ఉండాలన్న తపనే నాతో ఈ పని చేయించింది’’ అంటున్నాడు కదమ్.
Also read: Mosquitoes: మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
Bhagat Singh: ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు: మోదీ
నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలకు పేర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. దీనికిగాను పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే ప్రధాని ‘మన్ కీబాత్’ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 25న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also read: Astronomy photo: తోకచుక్క చెదురుతున్న వేళ...
చీతాలు చూసే అవకాశం మీదే..చీతాలు భారత్‌లో అడు గు పెట్టడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గర్వంగా భావిస్తున్నారని తెలిపారు. చీతాలు ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయని.. ప్రజల సందర్శనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. చీతాలకు పేరు పెట్టే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు తగిన విధంగా చీతాలకు పేర్లు సూచించాలని విజ్ఞప్తి చేశారు. మంచి పేరు సూచించిన వారిని ఎంపిక చేసి.. చీతాలను చూసే తొలి అవకాశం కల్పిస్తామన్నారు. అయితే.. ఇప్పటికే ఈ చీతాలను ఆశా, సియాయా, ఓబాన్, సిబిలి, సియాసా, సవన్న, శశా, ఫ్రెడ్డీ అనే ముద్దుపేర్లతో పిలుస్తున్నారు. వీటిలో ‘ఆశా’ పేరు స్వయంగా ప్రధాని మోదీ పెట్టిందే.
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. భగత్ సింగ్‌కు నివాళిగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సెప్టెంబరు 28న.. సర్జికల్ స్ట్రయిక్ వార్షికోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
North Korea: ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా సెప్టెంబర్ 25న స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగం జరిపింది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల కోసం అమెరికాకు విమాన వాహక నౌక ఆ ప్రాంతానికి చేరడంతో ఉద్రిక్తతలను రాజేసేందుకే ఉత్తర కొరియా ఈ చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా 30 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది.
Julius Baer Generation Cup: రన్నరప్ అర్జున్
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 2.5–0.5; 2–0తో అర్జున్‌పై గెలిచి విజేతగా అవతరించాడు. సెప్టెంబర్ 25న జరిగిన రెండో ఫైనల్ రెండు గేముల్లోనూ కార్ల్‌సన్ గెలిచాడు. కార్ల్‌సన్‌కు 33,500 డాలర్లు (రూ. 27 లక్షల 21 వేలు), అర్జున్‌కు 21,250 డాలర్లు (రూ. 17 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
India Vs Australia : టీ20 సీరీస్ భారత్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ ల టీ20 సీరీస్ ను భారత్ 2 -1 తేడాతో గెలుచుకుంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాదో విజయం సాధించి సీరీస్ కైవసం చేసుకుంది. 36 బంతుల్లో 69 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. సీరీస్ లో 8 వికెట్లు పడగొట్టిన అక్సర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌లతో కూడిన టి20 సిరీస్‌లను గెలవడం భారత్‌కిది (2016, 2020, 2022) మూడోసారి. ఈ ఏడాది భారత్ మొత్తం 29 టి20 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు నమోదు చేసింది. ఒకే ఏడాది అత్యధిక టి20 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. 20 విజయాలతో పాకిస్తాన్ (2021లో) పేరిట ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది. ఒకే ఏడాది అత్యధిక టి20 మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా ధోని (2016లో) పేరిట ఉన్న రికార్డును 15వ గెలుపుతో రోహిత్ శర్మ సమం చేశాడు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP