Skip to main content

Iga Swiatek: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచిన మొదటి పోలిష్ టెన్నిస్‌ స్టార్‌

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను తొలిసారి దక్కించుకుంది.
Poland's Robert Lewandowski delighted for Iga Swiatek's US
Poland's Robert Lewandowski delighted for Iga Swiatek's US

  సెప్టెంబర్ 10న అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ 6–2, 7–6 (7/5)తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... రన్నరప్‌ ఆన్స్‌ జబర్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

Also read: Caroline Garcia: సిన్సినాటి టైటిల్‌ గార్సియా సొంతం
 
ఈ ఏడాది స్వియాటెక్‌ నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ (దోహా, ఇండియన్‌ వెల్స్, మయామి, స్టుట్‌గార్ట్, రోమ్, ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌). 2014లో సెరెనా ఒకే ఏడాది ఏడు అంతకంటే ఎక్కువ టైటిల్స్‌ నెగ్గింది.  

స్వియాటెక్‌ కెరీర్‌లో సాధించిన సింగిల్స్‌ టైటిల్స్‌. ఈ పది ఫైనల్స్‌లో స్వియాటెక్‌ వరుస సెట్‌లలో గెలుపొందడం విశేషం.  

Also read: 2022 Formula 1 Season : ఫార్ములావన్‌–2022 సీజన్‌లో..వెర్‌స్టాపెన్‌ ఖాతాలో మ‌రో విజయం

ఒకే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన పదో ప్లేయర్‌గా స్వియాటెక్‌ నిలిచింది. గతంలో మార్గరెట్‌ కోర్ట్, బిల్లీజీన్‌ కింగ్, క్రిస్‌ ఎవర్ట్, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీ గ్రాఫ్, మోనిక సెలెస్, అరంటా శాంచెజ్, సెరెనా విలియమ్స్,  హెనిన్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.  

Also read: World cadet judo championships 2022: ప్రపంచ చాంపియన్‌ లింథోయ్‌

స్వియాటెక్‌   ఆన్స్‌ జబర్‌
1 ఏస్‌లు 0
2 డబుల్‌ ఫాల్ట్‌లు 4
11/16 నెట్‌ పాయింట్లు 7/15
5/12 బ్రేక్‌ పాయింట్లు 3/9
19 విన్నర్స్‌ 14
30 అనవసర తప్పిదాలు 33
81 మొత్తం పాయింట్లు 66

Also read: World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:41PM

Photo Stories