Skip to main content

World cadet judo championships 2022: ప్రపంచ చాంపియన్‌ లింథోయ్‌

బోస్నియా అండ్ హెర్జెగోవినాలోని సరజెవోలో జరిగిన ప్రపంచ జూడో చాంపియన్‌షిలో భారత అమ్మాయి లింథోయ్‌ చనంబమ్‌ సంచలనం సృష్టించింది.
India's Linthoi Chanambam wins gold medal at world cadet
India's Linthoi Chanambam wins gold medal at world cadet

క్యాడెట్‌ విభాగంలో (57 కేజీల కేటగిరీ) ఆమె విజేతగా నిలిచింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింథోయ్‌ ఆగష్టు  26 న జరిగిన ఫైనల్లో 1–0 తేడాతో రీస్‌ బియాంకా (బ్రెజిల్‌)ను ఓడించింది. 8 నిమిషాల 38 సెకన్ల పాటు సాగిన బౌట్‌లో భారత జుడోకా సత్తా చాటింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత జూడోకా ఒకరు ప్రపంచ చాంపియన్‌ కావడం ఇదే తొలిసారి. పురుషులు లేదా మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్, క్యాడెట్‌... ఇలా ఏ విభాగంలోనూ ఇప్పటి వరకు భారత్‌నుంచి ఎవరూ విజేతగా నిలవలేదు. గత జూలైలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కేడెట్‌ జూడో చాంపియన్‌షిప్‌లో లింథోయ్‌ కూడా స్వర్ణం సాధించింది.   

Also read: IMFలో ఈడీగా సుబ్రమణియన్‌ నియామకం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Aug 2022 05:55PM

Photo Stories