Skip to main content

IMFలో ఈడీగా సుబ్రమణియన్‌ నియామకం

భారత్‌ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను భారత్‌ తరఫున అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా నియమితులయ్యారు.
CEA Krishnamurthy V Subramanian
CEA Krishnamurthy V Subramanian

సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగష్టు 25 న ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఫైనాన్స్‌)లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఉత్తర్వుల ప్రకారం, క్యాబినెట్‌ వ్యవహారాల కమిటీ సుబ్రమణియన్‌ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌ నుంచి ప్రారంభమవుతుంది. మూడేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఐఎంఎఫ్‌ ఈడీ (భారత్‌) బాధ్యతల్లో ప్రస్తుతం ఉన్న డాక్టర్‌ సూర్జిత్‌ ఎస్‌ భల్లా అక్టోబర్‌ 31న పదవీ విరమణ పొందనున్నారు.   

Also read: Asia Cupలో భారత్‌ కోచ్‌గా VVS లక్ష్మణ్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Aug 2022 05:51PM

Photo Stories