Skip to main content

TS SERPకు జాతీయ స్థాయిలో గుర్తింపు

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర్‌ ప్రాజెక్టులో భాగంగా ‘10కే ఎఫ్‌పీవో’(ఎఫ్‌పీవో–ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్స్‌) పథకంలో 35 రైతు ఉత్పత్తి దారుల సమాఖ్యలను తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) నమోదు చేయించింది.
TS SERP is nationally recognized
TS SERP is nationally recognized

ఈ సమాఖ్యలను కంపెనీల చట్టం ప్రకారం చేర్పించారు. ఇందులో 23,469 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉంటూ తమ వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. 

Also read: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?

తెలంగాణ సెర్ప్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినందున కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రం అవార్డును అందుకుంది. సెప్టెంబర్ 7 న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం అదనపు కార్యదర్శి, రాష్ట్ర సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియాను అభినందిస్తూ ఆయన తరపున ఆ శాఖ ముఖ్య ఆపరేషనల్‌ అధికారి (సీవోవో) రజితకు మెమొంటోను అందజేశారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Sep 2022 06:27PM

Photo Stories