Skip to main content

National Award: ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ పుర‌స్కారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మైలవరపు కృష్ణ తేజ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి.
National Award to IAS Officer Krishna Teja  Mylavarapu Krishna Teja receiving the National Child Protection Commission Award

ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయ‌న బాల‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ‌లో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిపారు. దీంతో ఐఏఎస్ అధికారిగా ఆయ‌న‌ చేసిన కృషికిగాను జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు.

ఆయ‌న కష్టపడి సాధించిన విజయం..
➤ ఐఏఎస్ కావాలనే పట్టుదలతో 4 సార్లు పరీక్ష రాసి, చివరికి 66వ ర్యాంక్ సాధించారు.
➤ చిన్న వయస్సులోనే సామాజిక సేవలోకి అడుగుపెట్టి.. "I Am For Alleppey" అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రజలకు సహాయం చేశారు.
➤ త్రిస్సూర్‌లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి, జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు.

Helen Mary Roberts: బ్రిగేడియర్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళ.. ఆమె ఎవ‌రంటే..

ఆయ‌న వ్యక్తిగత జీవితం ఇదే..
➤ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
➤ తండ్రి శివానంద కుమార్ హోల్‌సేల్ వ్యాపారి, అమ్మ భువనేశ్వరి గృహిణి.
➤ పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో, ఇంటర్మీడియెట్ గుంటూరులోని జూనియర్ కళాశాలలో చదివారు.
➤ నర్సారావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు.

➤ ఐఏఎస్‌లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి పెట్టారు.
➤ ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ, అందుకు కృషి చేస్తూ ఉన్నారు.

First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

Published date : 15 Jun 2024 09:26AM

Photo Stories