Helen Mary Roberts: బ్రిగేడియర్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళ.. ఆమె ఎవరంటే..
Sakshi Education
హెలెన్ మేరీ రాబర్ట్స్ పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళ.
26 సంవత్సరాల సైనిక సేవలో, ఆమె అనేక అడ్డంకులను అధిగమించి చారిత్రక ఘనత సాధించింది.
ప్రస్తుతం ఈమె మెడికల్ కోర్‌లో సీనియర్ పాథాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె సేవకు గుర్తింపుగా 2020లో బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి పొందారు.
పాకిస్తాన్ జనాభాలో 96.47% మంది ముస్లింలు, 2.14% మంది హిందువులు, 1.27% మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ విజయం మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సమాన అవకాశాలు లభించాలనే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయత్నాలకు ఒక గుర్తుగా నిలుస్తుంది.
Jyoti Ratre: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధురాలిగా రికార్డు!!
Published date : 03 Jun 2024 12:35PM