Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
శాతవాహన యుగం
1. కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని 'ధాన్యకటకం' కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
1) కొండాపురం
2) రాచకొండ
3) ఏలేశ్వరం
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 4
2. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) డాక్టర్ సుక్తాంకర్
4) డాక్టర్ కె.గోపాలాచారి
- View Answer
- సమాధానం: 3
3. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) కె.పి.జయస్వాల్
4) డాక్టర్ సుక్తాంకర్
- View Answer
- సమాధానం: 1
4. శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) సుక్తాంకర్
3) పి.టి.శ్రీనివాస్
4) కె.పి.జయస్వాల్
- View Answer
- సమాధానం: 3
5. శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంతమని పేర్కొన్నవారు?
1) డాక్టర్ కె.గోపాలాచారి
2) కె.వి.జయస్వాల్
3) వి.వి.మిరాసి
4) డాక్టర్ సుక్తాంకర్
- View Answer
- సమాధానం: 1
6. కరీంనగర్ జిల్లాలో మహానగర శి«థిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
1) కోటిలింగాల
2) కదంబపూర్
3) తొగర్రాయి
4) పెద్దబంకూర్
- View Answer
- సమాధానం: 2
7. నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?
1) శ్రీముఖుడు
2) నారన
3) గోబద
4) సమగోపుడు
- View Answer
- సమాధానం: 3
8. శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు?
1) మొదటి శాతకర్ణి
2) కన్హుడు
3) రెండో శాతకర్ణి
4) శ్రీముఖుడు
- View Answer
- సమాధానం: 4
9. శ్రీముఖుడి పాలనా కాలం?
1) క్రీ.పూ. 231-200
2) క్రీ.పూ. 231-208
3) క్రీ.పూ. 231-205
4) క్రీ.పూ. 225-200
- View Answer
- సమాధానం: 2
10. శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం?
1) జైనం
2) వైదికం
3) బౌద్ధం
4) శైవం
- View Answer
- సమాధానం: 1
11. పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ.187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?
1) శ్రీముఖుడు
2) కన్హుడు
3) మొదటి శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
12. రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని 'కణ్ణబెణ్ణా'గా పేర్కొన్నారు?
1) గంగా
2) గోదావరి
3) కృష్ణా
4) వైన్ గంగా
- View Answer
- సమాధానం: 4
13. శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?
1) కన్హుడు
2) పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
14. నానాఘాట్ శాసనాన్ని వేయించిందెవరు?
1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
15. రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?
1) మత్స్య
2) గరుడ
3) వరాహ
4) యుగ పురాణం
- View Answer
- సమాధానం: 4
16. ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?
1) స్వాతికర్ణ
2) లంబోదరుడు
3) అపీలకుడు
4) మేఘస్వాతి
- View Answer
- సమాధానం: 2
17. 'బృహత్కథ', 'వాత్సా్యయన కామసూత్ర', 'కావ్య మీమాంస'లో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?
1) శ్రీముఖుడు
2) మొదటి శాతకర్ణి
3) కుంతల శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
18. శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) కుంతల శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) హాలుడు
4) మొదటి పులోమావి
- View Answer
- సమాధానం: 1
19. శాతవాహనుల్లో 15వ రాజు?
1) హాలుడు
2) మొదటి పులోమావి
3) గౌరకృష్ణ
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
20. 'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?
1) హాలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
21. 'త్రి సముద్ర తోయ పీతవాహన' అనేది ఎవరి బిరుదు?
1) మొదటి పులోమావి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
22. ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) మొదటి పులోమావి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 1
23. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు?
1) రెండో శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) శివశ్రీ
4) రెండో పులోమావి
- View Answer
- సమాధానం: 2
24. శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొన్నారు?
1) కౌశికీ పుత్ర శాతకర్ణి
2) నాలుగో పులోమావి
3) విజయశ్రీ
4) చంద్రశ్రీ
- View Answer
- సమాధానం: 1
25. 'ధాన్యకటకం'ను రాజధానిగా చేసుకొని పాలించిన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) నాలుగో పులోమావి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 2
26. శాతవాహనుల్లో చివరి పాలకుడెవరు?
1) విజయశ్రీ
2) చంద్రశ్రీ
3) శివశ్రీ
4) నాలుగో పులోమావి
- View Answer
- సమాధానం: 4
27. నాలుగో పులోమావిని ఓడించే నాటికి శ్రీశాంతమూలుడు ఎక్కడ బలవంతమైన నాయకుడిగా ఉన్నాడు?
1) విదర్భ
2) విజయపురి
3) మహారాష్ట్ర
4) కళింగ
- View Answer
- సమాధానం: 2
28. శాతవాహన పాలకుల వరసక్రమం?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, హాలుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి, రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి
4) హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
29. శాతవాహనుల కాలంలో ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచే వ్యక్తిని ఏమని పిలిచేవారు?
1) మహామాత్రులు
2) హిరణ్యకుడు
3) మహాసేనాపతి
4) నిబంధకారుడు
- View Answer
- సమాధానం: 2
30. శాతవాహనుల కాలంలో రాజాజ్ఞలు,రాజ్య వ్య వహారాలను పత్రాల్లో రాసి భద్రపరిచే వ్యక్తి?
1) నిబంధకారుడు
2) లేఖకుడు
3) హిరణ్యకుడు
4) అమాత్యుడు
- View Answer
- సమాధానం: 1
31. నిబంధకారులకు మరో పేరు?
1) అమాత్యులు
2) మహామాత్రులు
3) అక్షపటకులు
4) భాండాగారికులు
- View Answer
- సమాధానం: 3
32. కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట అనేది?
1) వైదిక స్థావరం
2) విద్యా కేంద్రం
3) బౌద్ధ స్థావరం
4) జైన స్థావరం
- View Answer
- సమాధానం: 4
33. శాతవాహన కాలంలో 'కులపెద్దలను' ఏ పేరుతో పిలిచేవారు?
1) గ్రామణి
2) నిబంధకారులు
3) అక్షపటకులు
4) గహపతులు
- View Answer
- సమాధానం: 4
34. శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
1) 6
2) 5
3) 4
4) 3
- View Answer
- సమాధానం: 1
35. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న 'స్కంధావారం' అనే పదానికి అర్థం?
1) మిలటరీ క్యాంప్
2) కంటోన్మెంట్
3) రక్షణదుర్గం
4) రాజకోట
- View Answer
- సమాధానం: 1
36. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న 'కటకం' అనే పదానికి అర్థం?
1) సైనిక శిబిరం
2) రక్షణ దుర్గం
3) రాజకోట
4) సైన్యాగారం
- View Answer
- సమాధానం: 4
37. ఖారవేలుడు ఏ నగరాన్ని గాడిదలతో తొక్కించి నేలమట్టం చేశాడు?
1) వినుకొండ
2) పిధుండ
3) హన్మకొండ
4) ఓరుగల్లు
- View Answer
- సమాధానం: 2
38. శాతవాహన కాలంనాటి చేతివృత్తిదారులైన 'సాలెవారు' అంటే?
1) వధకులు
2) కాసకారులు
3) కోలికులు
4) తిలపిష్టకులు
- View Answer
- సమాధానం: 3
39. శాతవాహనుల కాలంలో 'గధికులు' అనే చేతివృత్తి వారు చేసే పని?
1) మెరుగు పెట్టడం
2) కుండల తయారీ
3) కంచు పని
4) సుగంధ ద్రవ్యాల తయారీ
- View Answer
- సమాధానం: 4
40. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే పన్ను పేరేమిటి?
1) కరుకర
2) శ్రేణి
3) శ్రేష్టి
4) కాలిక
- View Answer
- సమాధానం: 1
41. శాతవాహనుల కాలంలో 'సేలవధకులు'గా ఎవరిని పేర్కొనేవారు?
1) కవులు
2) సాలెవారు
3) శిల్పులు
4) మేదరివారు
- View Answer
- సమాధానం: 3
42. శాతవాహనుల కాలంలో 'పసకరులు' అంటే ఎవరు?
1) కంచు పనివారు
2) సాలెవారు
3) శిల్పులు
4) మేదరివారు
- View Answer
- సమాధానం: 4
43. కులాలు వేటి నుంచి ఆవిర్భవించాయి?
1) వృత్తి సంఘాలు
2) ధర్మాలు
3) స్మృతులు
4) వర్తక సంఘాలు
- View Answer
- సమాధానం: 1
44. శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం?
1) గుర్రం బండి
2) ఎడ్ల బండి
3) కుక్కల బండి
4) ఒంటె బండి
- View Answer
- సమాధానం: 2
45. శాతవాహనుల కాలంలో విదేశాలతో వర్తకం చేసేవారిని ఏమని పిలిచేవారు?
1) శ్రేణులు
2) నిగమాలు
3) సార్దవాహులు
4) బిడారులు
- View Answer
- సమాధానం: 3
46. శాతవాహనుల 'నాణేల'పై ప్రధానంగా కనిపించేది?
1) ఓడముద్ర
2) చాపముద్ర
3) వృషభం
4) సింహం
- View Answer
- సమాధానం: 1
47. శాతవాహనుల 'టంకసాల' నగరం ఏది?
1) కొండాపురం
2) పెదబంకూరు
3) ధూళికట్ట
4) హన్మకొండ
- View Answer
- సమాధానం: 1
48. శాతవాహనులతో ఎక్కువగా వర్తక వ్యాపారం నిర్వహించిన విదేశీయులు?
1) అరేబియన్లు
2) పర్షియన్లు
3) గ్రీకులు
4) రోమన్లు
- View Answer
- సమాధానం: 4
49. శాతవాహనులు సముద్ర తీరంతోపాటు ఏ నదుల ద్వారా కూడా విదేశీ వ్యాపారం నిర్వహించేవారు?
1) కృష్ణా, గోదావరి
2) మూసీ, గోదావరి
3) మూసీ, కృష్ణా
4) గంగాగోదావరి
- View Answer
- సమాధానం: 2
50. 'గౌతమీ బాలశ్రీ' ఎవరి తల్లి?
1) మొదటి శాతకర్ణి
2) రెండో శాతకర్ణి
3) శ్రీముఖుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
51. శాతవాహనుల కాలంలో అధికంగా చెలామణిలో ఉన్న లోహం ఏది?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) కంచు
- View Answer
- సమాధానం: 1