Telangana History Quiz in Telugu: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో 'రాజ్ ప్రముఖ్'గా నియమితులయ్యారు?
మాదిరి ప్రశ్నలు
1. వెల్లోడి ప్రభుత్వంలో నియమితులైన మంత్రులు, వారి శాఖలను జతపరచండి.
జాబితా - I (మంత్రుల పేర్లు)
I) బూర్గుల రామకృష్ణారావు
II) ఎం. శేషాద్రి
III) సి.వి.ఎస్. రావు
IV) మూల్‌చంద్ గాంధీ
జాబితా - II (శాఖలు)
a) ఆర్థిక, వాణిజ్య శాఖ
b) వైద్య,ఆరోగ్య శాఖ
c) హోం, సమాచార, న్యాయ శాఖ
d) విద్య, ఎక్సైజ్ శాఖ
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-b, ii-c, iii-a, iv-d
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
2. 1948లో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాం దాఖలు చేసిన హైదరాబాద్ ఫిర్యాదును బలపరిచిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎవరు?
1) నవాబ్ మొయిన్ నవాజ్ జంగ్
2) సర్ నిజామత్ జంగ్
3) సర్ మహమ్మద్ జాఫరుల్లా ఖాన్
4) మహమ్మద్ అలీ జిన్నా
- View Answer
- సమాధానం: 3
3. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో 'రాజ్ ప్రముఖ్'గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు?
1) భారత రాష్ట్రపతి
2) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
3) హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్
4) పైన పేర్కొన్న వారెవరూ కాదు
- View Answer
- సమాధానం: 4
4. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో 'రాజ్ ప్రముఖ్'గా నియమితులయ్యారు?
1) 1948
2) 1949
3) 1950
4) 1952
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Quiz in Telugu: తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాల్లో ఉన్న పద్యాలు?
5. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) రావి నారాయణ రెడ్డి 1949 తెలంగాణ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు
2) పోలీస్ చర్య సందర్భంగా హైదరాబాద్ సంస్థానంలో మిలటరీ దురాగతాలపై విచారణకు నెహ్రూ.. 'పండిట్ సుందర్‌లాల్ కమిటీ'ని నియమించారు
3) ఉర్దూలో'రజాకార్' పదానికి అర్థం'వలంటీర్'
4) పోలీస్ చర్య తర్వాత కాశీం రజ్వీ గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని పాకిస్తాన్‌కు పారిపోయాడు
- View Answer
- సమాధానం: 4
6. కింద పేర్కొన్న వారిలో 'కామ్రేడ్స్ అసోసియేషన్'లో సభ్యులు కానిది ఎవరు?
1) మగ్దూం మొహియుద్దీన్
2) ఆలంఖుంద్ మీర్
3) రావి నారాయణ రెడ్డి
4) రాజ్ బహదూర్ గౌర్
- View Answer
- సమాధానం: 3
7. ఆరుట్ల రామచంద్రారెడ్డిపై పోలీసులు పెట్టిన 'పాలకుర్తి కేసు'లో ఆయన తరఫున∙వాదించిన న్యాయవాది ఎవరు?
1) పింగళి వెంకట్రామ్ రెడ్డి
2) పింగళి జగన్మోహన్ రెడ్డి
3) చకిలం యాదగిరి రావు
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: 4
8. హైదరాబాద్ సంస్థానంలో వెల్లోడి 1949 డిసెంబర్ 1న ఏ హోదాలో నియమితులయ్యారు?
1) గవర్నర్ జనరల్
2) ముఖ్యమంత్రి
3) ప్రధానమంత్రి
4) రాజ్ ప్రముఖ్
- View Answer
- సమాధానం: 3
9. పాలకుర్తిలో ఎస్.పి. విచారణ సందర్భంగా ఐలమ్మ కుటుంబానికి, కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి కమ్యూనిస్ట్ పార్టీ కింది వారిలో ఏ ప్రముఖుడిని పంపించింది?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) రావి నారాయణ రెడ్డి
3) దేవులపల్లి వేంకటేశ్వరరావు
4) చండ్ర రాజేశ్వర రావు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
10. రహస్యంగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి నిజాం ప్రభుత్వం నియమించుకున్న విదేశీయుడు ఎవరు?
1) రోస్ అలెన్
2) ఆర్థర్ కాటన్
3) సిడ్నీ కాటన్
4) ఎల్. అడ్రూస్
- View Answer
- సమాధానం: 3
11. రజాకార్ల కేంద్ర కార్యాలయం పేరేమిటి?
1) దార్-ఉల్-ఉలూమ్
2) దారుస్సలాం
3) సుఖా హúస్
4) పురాణీ హవేలీ
- View Answer
- సమాధానం: 2
12. షోయబుల్లాఖాన్ హత్యకు గురైనప్పుడు ఏ పత్రికలో పనిచేసేవారు?
1) గోలకొండ
2) మీజాన్
3) రయ్యత్
4) ఇమ్రోజ్
- View Answer
- సమాధానం: 4
13. రజాకార్ల నేతగా వ్యవహరించడానికి ముందు కాశీం రజ్వీ ఏ వృత్తిలో ఉన్నాడు?
1) డాక్టర్
2) మిలటరీ అధికారి
3) ఇంజనీర్
4) న్యాయవాది
- View Answer
- సమాధానం: 4
14. కింద పేర్కొన్న వారిలో 'డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్' నాయకుడు ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) జయసూర్య
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) బి.ఎస్. వెంకట్రావ్
- View Answer
- సమాధానం: 4
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
15. కాశీం రజ్వీ ఒత్తిడితో రాజీనామా చేసిన హైదరాబాద్ సంస్థాన్ దివాన్ ఎవరు?
1) లాయక్ అలీ
2) పింగళి వెంకట్రామ్రెడ్డి
3) ఛత్తారీ నవాబ్
4) నవాబ్ అలీ యావర్ జంగ్
- View Answer
- సమాధానం: 3