Telangana History Bit Bank in Telugu: హైదరాబాద్ సంస్థానంలో ‘పోలీసు చర్య’ ఎప్పుడు జరిగింది?
మాదిరి ప్రశ్నలు
1. తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది?
1) తంజావూరు
2) ఔధ్
3) హైదరాబాద్
4) మైసూరు
- View Answer
- సమాధానం: 3
2. ‘అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్’ గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) జిడ్డు కృష్ణమూర్తి
2) సర్వేపల్లి రాధాకృష్ణ
3) అనిబీసెంట్
4) సి.ఆర్. రెడ్డి
- View Answer
- సమాధానం: 1
3. కింద పేర్కొన్న ప్రముఖుల జాబితాలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి.
1) రావి నారాయణ రెడ్డి
2) బద్దం ఎల్లారెడ్డి
3) వి. ఆళ్వారు స్వామి
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 4
4. హైదరాబాద్ రాష్ట్రంలో ‘ఇత్తెహాద్–ఉల్– ముస్లిమీన్’ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
1) 1927
2) 1930
3) 1938
4) 1940
- View Answer
- సమాధానం: 1
5. ఇండియన్ యూనియన్‌తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది?
1) 1947 నవంబర్ 27
2) 1947 నవంబర్ 28
3) 1947 నవంబర్ 29
4) 1947 నవంబర్ 30
- View Answer
- సమాధానం: 3
6. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు?
1) 1916
2) 1917
3) 1918
4) 1919
- View Answer
- సమాధానం: 3
7. ‘హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్’ (తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర) గ్రంథాన్ని ఎవరు రాశారు?
1) బి. రామకృష్ణారావు
2) దేవులపల్లి రామానుజరావు
3) రావి నారాయణ రెడ్డి
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 2
8. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ‘చాందా రైల్వే స్కీమ్’ ఆందోళన దేన్ని సూచిస్తుంది?
1) రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం
2) ప్రభుత్వ ఉదార విధానం
3) ముస్లిం ప్రభువర్గాల వైఖరి
4) పైన పేర్కొన్నవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
9. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతర ఉద్యమం’ ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1905
2) 1921
3) 1935
4) 1938
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History Bitbank in Telugu: 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
10. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు?
1) 1943
2) 1944
3) 1945
4) 1946
- View Answer
- సమాధానం: 4
11. హైదరాబాద్ నిజాం 1932లో అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన నియమించిన కమిటీ వేటికి సంబంధించింది?
1) సాంఘిక సంస్కరణలు
2) రాజకీయ సంస్కరణలు
3) విద్యారంగ సంస్కరణలు
4) మత సామరస్యం
- View Answer
- సమాధానం: 2
12. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) మాడపాటి హన్మంతరావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) ఆదిరాజు వీరభద్రరావు
- View Answer
- సమాధానం: 1
13. హైదరాబాద్‌లోని ‘సాలార్జంగ్ మ్యూజియం’లో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు?
1) మీర్ మెమిన్
2) మొదటి సాలార్ జంగ్
3) రెండో సాలార్ జంగ్
4) మూడో సాలార్ జంగ్
- View Answer
- సమాధానం: 4
14. అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కొలువులో ఉన్నారు?
1) సింగ భూపాలుడు
2) అబుల్ హసన్ తానీషా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) కాకతీయ ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana Geography Bit Bank in Telugu: కుందాయి జలపాతం ఏ జిల్లాలో ఉంది?
15. ‘రామప్ప దేవాలయం’ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) క్రీ.శ. 1162
2) క్రీ.శ. 1191
3) క్రీ.శ. 1206
4) క్రీ.శ. 1213
- View Answer
- సమాధానం: 4
16. పాలంపేటలో ప్రసిద్ధ ‘రామప్ప దేవాలయం’ను ఎవరు నిర్మించారు?
1) గణపతిదేవుడు
2) రేచర్ల రుద్రుడు
3) జాయప నాయకుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 2
17. నిజాం–ఉల్–ముల్క్ ఏ మొగల్ పాలకుడిని ఓడించి, హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు?
1) అబుల్ హసన్ తానీషా
2) హసన్ కులీ ఖాన్
3) ముబారిజ్ ఖాన్
4) అజయ్ షా
- View Answer
- సమాధానం: 3
18. ‘పచ్చల సోమేశ్వర దేవాలయం’ ఎక్కడ ఉంది?
1) వరంగల్
2) అలంపూర్
3) వేములవాడ
4) పానగల్
- View Answer
- సమాధానం: 4
19. భారతదేశంలో బ్రిటిషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు?
1) బొంబాయి
2) మద్రాసు
3) హుగ్లీ
4) సూరత్
- View Answer
- సమాధానం: 4
చదవండి: General Studies Bit Bank in Telugu: 'గోల్డెన్ రైస్'ను సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు?
20. కోరమాండల్ తీరం నుంచి డచ్చివారి ప్రధాన ఎగుమతి ఏది?
1) నేత సరకు
2) నీలి మందు
3) మసాలా దినుసులు
4) సురేకారం
- View Answer
- సమాధానం: 3
21. హైదరాబాద్ సంస్థానంలో ‘పోలీసు చర్య’ ఎప్పుడు జరిగింది?
1) డిసెంబరు 1947
2) సెప్టెంబరు 1948
3) డిసెంబరు 1948
4) మార్చి 1949
- View Answer
- సమాధానం: 2
22. మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్టించాడు?
1) క్రీ.శ. 1512
2) క్రీ.శ. 1518
3) క్రీ.శ. 1580
4) క్రీ.శ. 1591
- View Answer
- సమాధానం: 3
23. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి?
1) ఆపరేషన్ బ్లూస్టార్
2) ఆపరేషన్ భజరంగ్
3) ఆపరేషన్ పోలో
4) ఆపరేషన్ జీరో
- View Answer
- సమాధానం: 3
24. బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం (ఫ్యాక్టరీ) స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) మహమ్మద్ కులీ కుతుబ్ షా
4) మహమ్మద్ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 3
25. ‘హైదరాబాద్‌లో ఆర్య సమాజం’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1890
2) 1892
3) 1895
4) 1896
- View Answer
- సమాధానం: 2
26. 1906లో హైదరాబాద్‌లో స్థాపించిన ‘వివేకవర్థిని’ పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు?
1) కేశవరావ్ కొరాట్కర్
2) వామన రావ్ నాయక్
3) గణపతిరావ్ హార్ధికర్
4) స్వామీ రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 4
27. హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ హైదరాబాద్‌ను ఏ సంవత్సరంలో సందర్శించారు?
1) 1930
2) 1931
3) 1932
4) 1936
- View Answer
- సమాధానం: 1
28. వైస్రాయ్ ఆఫ్ ఇండియా ‘లార్డ్ రిప్పన్’ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) నిజాం అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా
4) మీర్ మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
29. హైదరాబాద్‌లో హైకోర్టు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు?
1) నిజాం అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) సికిందర్ జా
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History Study Material: సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిందెవరు?
30. ‘ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ గ్రంథకర్త?
1) సయ్యద్ అలీ బిల్గ్రామి
2) లాయక్ అలీ
3) గులాం యాజ్దాని
4) మహమ్మద్ బిల్గ్రామి
- View Answer
- సమాధానం: 2
31. గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తవ్వించారు?
1) నాసిరుద్దౌలా
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
32. ఆర్థిక సంస్కరణల్లో భాగంలో హైదరాబాద్‌లో ‘హోలీసిక్కా’ అనే రూపాయి నాణేన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) మొదటి సాలార్ జంగ్ (తురాబ్ అలీఖాన్)
3) లాయక్ అలీ
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
33. ‘అసఫ్ జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి. బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబు పాదాలు కడగాలి’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) సాదర్ జంగ్ అలీ
2) షోయబుల్లాఖాన్
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) కాశీం రజ్వీ
- View Answer
- సమాధానం: 4
34 రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చిన పాలకుడెవరు?
1) నిజాం అలీఖాన్
2) సికిందర్ జా
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) నాసిరుద్దౌలా
- View Answer
- సమాధానం: 1
35. 1765లో ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీఖాన్ తిరస్కరించాడు. ఆ సందర్భంలో ఆంగ్లేయులకు, నిజాంకు మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు?
1) రుకినుద్దౌలా
2) సలాబత్ జంగ్
3) బసాలత్ జంగ్
4) కాండ్రేగుల జోగిపంతులు
- View Answer
- సమాధానం: 4
36. హైదరాబాద్ రాజ్యంలో ‘వహాబీ’ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1) ముబారిజుద్దౌలా
2) నాసిరుద్దౌలా
3) నిజాం అలీఖాన్
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 1
37. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకుడెవరు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) నాసిరుద్దౌలా
3) అఫ్జలుద్దౌలా
4) మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 3
38. కింద పేర్కొన్న వారిలో ‘వందేమాతరం గీతం’ ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుడు ఎవరు?
1) మాడపాటి హన్మంత రావు
2) వెల్దుర్తి మాణిక్యరావు
3) రామచంద్రరావు
4) బండి యాదగిరి
- View Answer
- సమాధానం: 3
39. హైదరాబాద్‌లో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ను ఎవరు స్థాపించారు?
1) ధవళ శ్రీనివాసరావు
2) దేవులపల్లి రామానుజరావు
3) కాళోజీ నారాయణరావు
4) బిరుదు వెంకట శేషయ్య
- View Answer
- సమాధానం: 4
చదవండి: Indian Polity Study Material: 1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు..
40. హైదరాబాద్‌లో ‘నిజాం కళాశాల’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1887
2) 1886
3) 1885
4) 1884
- View Answer
- సమాధానం: 1
41. తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి 1913లో ‘మానవతా సంఘం (Humanitarian League)’ను ఎవరు నెలకొల్పారు?
1) అఘోరనాథ ఛటోపాధ్యాయ
2) రాయ్ బాలముకుంద్
3) వామనరావ్ నాయక్
4) సరోజినీ నాయుడు
- View Answer
- సమాధానం: 2
42. 1905లో ‘ఆంధ్ర సంవర్థినీ గ్రంథాలయం’ను ఎక్కడ స్థాపించారు?
1) సికింద్రాబాద్
2) నల్లగొండ
3) మహబూబ్ నగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
43. తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి 1921లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్’కు ఎవరు అధ్యక్షత వహించారు?
1) మహర్షి కార్వే
2) కేశవరావ్ కొరాట్కర్
3) మాడపాటి హన్మంతరావు
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 1
44. తెలంగాణలో తెలుగు భాషా ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ‘ఆంధ్ర జనసంఘం’ను ఏర్పాటు చేయడంలో కింది వారిలో ముఖ్య కారకులు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) మాడపాటి హన్మంతరావు
3) ఆదిరాజు వీరభద్రరావు
4) అల్లంపల్లి వెంకటరామారావు
- View Answer
- సమాధానం: 4
45. 1906లో హైదరాబాద్‌లో ‘విజ్ఞాన చంద్రికా మండలి’ వ్యవస్థాపకులు ఎవరు?
1) రామానంద తీర్థ
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 3
46. హైదరాబాద్ రాష్ట్రంలో ‘జిల్లా బందీ పద్ధతి’ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1862
2) 1863
3) 1864
4) 1865
- View Answer
- సమాధానం: 2
47. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి?
1) వేములవాడ
2) ఓరుగల్లు
3) అలంపురం
4) పిల్లలమర్రి
- View Answer
- సమాధానం: 3
48. కిందివాటిలో సరికాని జత ఏది?
1) నన్నెచోడుడు–కుమార సంభవం
2) సోమనాథుడు–పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి–బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు– శివతత్త్వసారం
- View Answer
- సమాధానం: 3
49. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి?
1) రుద్రమదేవి
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Kakatiyas (History) Notes for Groups: ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
50. ‘ఆంధ్ర సురత్రాణ’ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు?
1) ప్రోలయనాయకుడు
2) అనవేమారెడ్డి
3) కాపయనాయకుడు
4) గన్నయ
- View Answer
- సమాధానం: 3
51. ఎర్రాప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధి కారి?
1) అల్లాడరెడ్డి
2) అనవేమారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) అనవోతారెడ్డి
- View Answer
- సమాధానం: 3
52. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
1) నెల్లూరు
2) మచిలీపట్నం
3) మోటుపల్లి
4) ధరణికోట
- View Answer
- సమాధానం: 3
53. రుద్రమదేవి పాలనాకాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?
1) డొమింగో పేస్
2) నికోలోకోంటి
3) మార్కోపోలో
4) జోర్డానస్
- View Answer
- సమాధానం: 3
54. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతి దేవుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1
55. తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది?
1) జైనం
2) శైవం
3) బౌద్ధం
4) ౖÐð ష్ణవం
- View Answer
- సమాధానం: 1
56. హన్మకొండ వేయి స్తంభాలగుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలానగరాలకు పునాది వేసిన కాకతీయ రాజు ఎవరు?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రమదేవి
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 4