Telangana History Quiz in Telugu: తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది?
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ సాంఘిక జీవనం నేపథ్యంగా వచ్చిన కావ్యం 'సింహాసన ద్వాత్రింశక' రచయిత?
1) కొరవి గోపరాజు
2) పాల్కురికి సోమనా«థుడు
3) కాకనూరి తిమ్మకవి
4) అనంతామాత్యుడు
- View Answer
- సమాధానం: 1
2. వేశ్యా వృత్తాంతం నేçపథ్యంగా వచ్చిన పోతన రచన ఏది?
1) వీరభద్ర విజయం
2) భోగినీ దండకం
3) భాగవతం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
3. సింగ భూపాలీయం అనే నామాంతరం ఉన్న సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథం?
1) నీతిసారం
2) సకల నీతి సమ్మతం
3) రసార్ణవ సుధాకరం
4) మదన విలాపం
- View Answer
- సమాధానం: 3
4. కింది కవులు- రచనల్లో సరికాని జత ఏది?
1) దేవులపల్లి రామానుజరావు-మిఠాయి చెట్టు
2) రాళ్లపల్లి అనంతకృçష్ణ శర్మ - శాలివాహన గాథా సప్తశతి సారం
3) సురవరం ప్రతాపరెడ్డి- ఆంధ్రుల సాంఘిక చరిత్ర
4) బూర్గుల రామకృష్ణారావు- సారస్వత వ్యాస ముక్తావళి
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History Bitbank in Telugu: 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
5. మెదక్ జిల్లా కొండాపూర్లో ప్రపంచ క«థకు మూలమైన బృహత్కథా మంజరిని గుణాడ్యుడు ఏ భాషలో రాశాడు?
1) సంస్కృతం
2) పైశాచి
3) పాళీ
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 2
6. తెలంగాణకు చెందిన చుక్కా సత్తయ్య ఏ కళకు జాతీయ స్థాయి గౌరవాన్ని కల్పించాడు?
1) తోలు బొమ్మలాట
2) చిందు భాగవతం
3) కోలాటం
4) ఒగ్గు కథ
- View Answer
- సమాధానం: 4
7. ఎవరి సంపాదకీయంలో నల్లగొండ నుంచి నీలగిరి పేరుతో వారపత్రిక వెలువడింది?
1) ఆళ్వారు స్వామి
2) షబ్నవిసు రామనరసింహారావు
3) ఒద్దిరాజు సోదరులు
4) కోదాటి నారాయణరావు
- View Answer
- సమాధానం: 2
8. తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాల్లో ఉన్న పద్యాలు?
1) కంద పద్యాలు
2) సీçస పద్యాలు
3) ఆట వెలది పద్యాలు
4) తేటగీతి పద్యాలు
- View Answer
- సమాధానం: 1
9. తెలుగులో తొలి కవుల చరిత్ర 'కవి జీవితాలు' రాసిన కవి?
1) కొరవి గోపరాజు
2) వేములవాడ భీమకవి
3) గురజాడ శ్రీరామమూర్తి
4) మానవల్లి రామకృష్ణ కవి
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Bitbank in Telugu: నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
10. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే, సరసమై పరిగిన జాను తెనుంగు అంటూ దేశీయ భాషకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించిన కవి?
1) బిరుదురాజు రామరాజు
2) వేముగంటి నరసింహాచార్యులు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) పాల్కురికి సోమనా«థుడు
- View Answer
- సమాధానం: 4
11. తెలుగు వారి గురించి తొలిసారిగా పేర్కొన్న గ్రం«థం?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) వాయు పురాణం
3) బృహత్క«థ
4) అష్టాధ్యాయి
- View Answer
- సమాధానం: 1
12. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ప్రకటించింది?
1) 2014 జూన్ 12
2) 2014 ఆగస్టు 15
3) 2014 జూన్ 16
4) 2014 జూన్ 2
- View Answer
- సమాధానం: 3
13. మొత్తం తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మ పండుగలో ఎన్నో రోజున అలిగిన బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఆడరు?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 2
14. నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది?
1) 1996
2)1997
3) 1999
4) 2001
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History Bitbank in Telugu: 'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు ఎవరు?
15. దివ్యజ్ఞాన సమాజ భావాలతో వెలువడిన ఆంధ్రమాత పత్రిక సంపాదకులు?
1) సరోజినీ నాయుడు
2) బండారు శ్రీనివాస శర్మ
3) సురవరం ప్రతాపరెడ్డి
4) స్వామి వెంకట్రావు
- View Answer
- సమాధానం: 4
16. కింది వారిలో ఆంధ్ర సారస్వత పరిçషత్తు స్థాపకులు?
1) రావి నారాయణ రెడ్డి
2) కాళోజీ నారాయణరావు
3) దేవులపల్లి రామానుజరావు
4) దయానంద సరస్వతి
- View Answer
- సమాధానం: 3
17. తెలుగులో తొలి దినపత్రిక 'తెలంగాణ'కు సంపాదకులు ఎవరు?
1) బుక్కపట్నం రామానుజాచార్యులు
2) మందముల నరసింహారావు
3) బండారు శ్రీనివాస శర్మ
4) మహర్షి కార్వే
- View Answer
- సమాధానం: 1
18. తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా సాహితీమేఖల అనే సాహిత్య సంస్థ ఏ జిల్లాలో ప్రారంభమైంది?
1) మహబూబ్నగర్æ
2) నల్లగొండ
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
19. 'ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి కార్యక్రమం లక్ష్యం?
1) స్త్రీ విద్యా వ్యాప్తి
2) వేద విజ్ఞానాన్ని అందరికీ చేరవేయడం
3) కులాంతర వివాహాలను ప్రోత్సహించడం
4) ఇతర మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూమతంలోకి రప్పించడం
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History Bit Bank: 2006లో క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
20. 'గ్రంథాలయాలు-ప్రదేశాలు'లో సరైన జత ను గుర్తించండి?
1) శ్రీకృష్ణ దేవరాయాం్ర«ధ భాషా నిలయం- హైదరాబాద్
2) శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం - హన్మకొండ
3) ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం - సూర్యాపేట
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ఇబ్రహీం కుతుబ్ షా సర్ధారు అమీన్ఖాన్కు అంకితమిచ్చిన తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్రను రాసింది ఎవరు?
1) పొన్నగంటి తెలగన్న
2) కొరవి గోపరాజు
3) పాల్కురికి సోమన
4) సర్వజ్ఞ సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 1
22. 'బండెనక బండిగట్టి, పదహారు బండ్లుకట్టి, ఏ బండ్లో వస్తవు కొడుకో నైజాం సర్కరోడా' అనే పాటను రాసి తెలంగాణ సాయుధç పోరాటాన్ని ఉరకలెత్తించిన కవి?
1) అందెశ్రీ
2) గద్దర్
3) యాదగిరి
4) ఆళ్వారుస్వామి
- View Answer
- సమాధానం: 3
23. పాల్కురికి సోమనా«థుని రచనల్లో సరైన ఆంశం ఏది?
1) తెలుగులో తొలిసారి వెలువడిన స్వతంత్ర వీరశైవ పురాణం- బసవ పురాణం
2) తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం- పండితారాధ్య చరిత్ర
3) మకుట నియమం, సంఖ్యానియమం ఉన్న తొలిశతకం -వృషాధిప శతకం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
24. తెలుగులో వెలువడిన తొలి రామాయణం?
1) రంగనాథ రామాయణం
2) మొల్ల రామాయణం
3) భాస్కర రామాయణం
4) నిర్వచనోత్తర రామాయణం
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana Culture & Literature: ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్నవారెవరు?
25. అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైందిగా భావించే మార్కండేయ పురాణంలో ఉన్న ఆశ్వాసాల సంఖ్య?
1) 6
2) 8
3) 12
4) 16
- View Answer
- సమాధానం: 2
26. 1953లో అలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిçషత్తు సప్తమ వార్షికోత్సవ సభల్లో ఆవిష్కరించిన కాళోజీ రచన?
1) నా గొడవ
2) జీవన గీత
3) జైలు లోపల
4) ఉద్యమ గీతి
- View Answer
- సమాధానం: 1
27. కాశీనాథుని నాగేశ్వరావు గారి పేరిట దేశోద్ధారక గ్రంథమాలను నెలకొల్పింది ఎవరు?
1) వెల్దుర్తి మాణిక్యరావు
2) కాళోజీ నారాయణరావు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) మాడపాటి హనుమంతరావు
- View Answer
- సమాధానం: 3
28. 1930లో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించింది?
1) బూర్గుల రామకృష్ణారావు
2) మాడపాటి హనుమంతరావు
3) రావి నారాయణరెడ్డి
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
29. తెలుగులో తొలి లక్షణ గ్రంథం కవి జనాశ్రయం రాసింది ఎవరు?
1) మల్లియ రేచన
2) సోమదేవ సూరి
3) త్రిపురాంతకుడు
4) కందుకూరి రుద్రకవి
- View Answer
- సమాధానం: 1
చదవండి: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
30. సి.నారాయణరెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది?
1) ప్రపంచపదులు
2) విశ్వంభర
3) నాగార్జున సాగరం
4) మధ్యతరగతి మందహాసం
- View Answer
- సమాధానం: 2