Telangana History Bitbank in Telugu: 'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు ఎవరు?
మాదిరి ప్రశ్నలు
1. సంఘసంస్కర్త 'మౌల్వీ మొహీబ్ హుస్సేన్'కు సంబం«ధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) ఇతడు హైదరాబాద్‌లో స్త్రీ విద్య వైతాళికుడిగా గుర్తింపు పొందాడు
2) ఇతడిని హైదరాబాద్‌లో జర్నలిజానికి రూపశిల్పిగా పేర్కొంటారు
3) ఇతడు స్థాపించిన 'మౌల్లం-ఎ-షఫిక్' పత్రికను నిజాం ప్రభుత్వం మూసివేయించింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. 1902లో 'బీరార్ ఒప్పందం'పై సంతకం చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు?
1) లార్డ్ రిప్పన్
2) లార్డ్ కర్జన్
3) మౌంట్ బాటన్
4) లార్డ్ మింటో
- View Answer
- సమాధానం: 2
3. 'హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ'ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1918
2) 1916
3) 1915
4) 1921
- View Answer
- సమాధానం: 1
4. కింద పేర్కొన్న వారిలో అఘోరనాథ్ ఛటోపాధ్యాయతో కలిసి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన సంఘసంస్కర్త ఎవరు?
1) అక్బర్ అలీఖాన్
2) మహమ్మద్ అన్సారీ
3) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
4) మక్బూల్ అలీ
- View Answer
- సమాధానం: 3
5. స్వదేశీ ఉద్యమంలో భాగంగా బొంబాయి నుంచి చరఖాలను తెప్పించిన ప్రొఫెసర్?
1) డాక్టర్ జయసూర్య
2) మీర్ మహమ్మద్ హుస్సేన్
3) బద్రుల్ హసన్
4) మహమ్మద్ అన్సారీ
- View Answer
- సమాధానం: 3
6. 'హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్'ను ఏ తేదీన ఏర్పాటు చేశారు?
1) 1938 జనవరి 9
2) 1938 జనవరి 19
3) 1938 జనవరి 11
4) 1938 జనవరి 29
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో స్వదేశీ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
1) నైజాం పౌరసంఘం
2) అంజుమన్ ఇక్వాన్-సఫా
3) యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ
4) కిసాన్ సభ
- View Answer
- సమాధానం: 2
8. హైదరాబాద్‌లో 'ఖిలాఫత్ ఉద్యమం' ఎవరి నాయకత్వంలో జరిగింది?
1) కేశవరావు కోరట్కర్, నవాబ్ అస్గర్యార్ జంగ్
2) డాక్టర్ జయసూర్య, మీర్ మహమ్మద్ హుస్సేన్
3) కేశవరావు కోరట్కర్, డాక్టర్ జయసూర్య
4) జయసూర్య, అక్బర్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 1
9. నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో 'నైజాం పౌరసంఘం'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1933
2) 1935
3) 1931
4) 1937
- View Answer
- సమాధానం: 2
చదవండి: Telangana History Bit Bank: 2006లో క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
10. 'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు?
1) బహదూర్ యార్ జంగ్
2) నవాబ్ అస్గర్ యార్ జంగ్
3) మహమ్మద్ అన్సారీ
4) నిజామత్ జంగ్
- View Answer
- సమాధానం: 4
11. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో చేరిన హైదరాబాద్ జాతీయోద్యమ ముస్లిం నాయకులెవరు?
1) మఖ్దూం మొయినుద్దీన్, బందగీ
2) ఆబిద్ హుస్సేన్, సప్రానీ
3) షోయబుల్లాఖాన్, బందగీ
4) నిజామత్ జంగ్, బహదూర్ యార్ జంగ్
- View Answer
- సమాధానం: 2
12. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో మొదటి బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమం ఏది?
1) 1857 సిపాయిల తిరుగుబాటు
2) వహాబీ ఉద్యమం
3) రొహిల్లా తిరుగుబాటు
4) రాంజీ గోండ్ తిరుగుబాటు
- View Answer
- సమాధానం: 2
13. పంజాబ్‌లో సిక్కుల ప్రభుత్వం, దేశంలో ఆంగ్లేయుల ప్రభుత్వం పోవాలనేది ఏ ఉద్యమ లక్ష్యం?
1) 1857 సిపాయిల తిరుగుబాటు
2) వహాబీ ఉద్యమం
3) రొహిల్లా తిరుగుబాటు
4) రాంజీ గోండ్ తిరుగుబాటు
- View Answer
- సమాధానం: 2
14. 'తెలంగాణలో మొదటి రాజకీయోద్యమం'గా దేన్ని పేర్కొంటారు?
1) వహాబీ ఉద్యమం
2) 1857 సిపాయిల తిరుగుబాటు
3) స్వదేశీ ఉద్యమం
4) రొహిల్లా తిరుగుబాటు
- View Answer
- సమాధానం: 1
15. బొల్లారం (హైదరాబాద్)లో కంటింజెంట్ సైన్యంలో అలజడి జరిగి బ్రిగేడియర్ మెకంజీపై దాడి ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1883
2) 1887
3) 1881
4) 1885
- View Answer
- సమాధానం: 4
16. చాందా రైల్వే పథకాన్ని లండన్ నుంచి తెచ్చిన అప్పుతో కాకుండా స్థానిక వనరులతో నిర్మించాలని 1883లో ఎవరి ఆధ్వర్యంలో ఉద్యమం చేశారు?
1) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
2) రామచంద్ర పిళ్లై
3) లక్ష్మణ్దేశ్జీ
4) కంటప్రసాద్
- View Answer
- సమాధానం: 1
17. హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రజా ఉద్యమం ఏది?
1) వహాబీ ఉద్యమం
2) స్వదేశీ ఉద్యమం
3) చాందా రైల్వే పథక వ్యతిరేక ఉద్యమం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
18. 'యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ'ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1879
2) 1825
3) 1877
4) 1880
- View Answer
- సమాధానం: 1
19. 'జాతీయత అనేది హైదరాబాద్ రాజ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది' అని ఎవరు పేర్కొన్నారు?
1) రామచంద్ర పిళ్లై
2) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
3) మోహిసిన్ ఉల్‌ముల్క్
4) అల్లా ఉద్దీన్ మౌల్వీ
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Bitbank in Telugu: తొలి ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
20. హైదరాబాద్‌లో రాజకీయ చైతన్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1882లో 'థియోసోఫికల్ సొసైటీ'ని స్థాపించారు
2) 1896లో బొల్లారంలో ఆల్ బర్డ్ 'రీడింగ్ రూం' ఏర్పాటు చేశారు
3) 1900లో 'హిందూ సోషల్ క్లబ్', 'సికింద్రాబాద్ క్లబ్' స్థాపించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో నిజాం ప్రభుత్వ నిర్బంధం వల్ల మూతపడిన పత్రిక ఏది?
1) ద దక్కన్ స్టాండర్డ్
2) ది హైదరాబాద్ రికార్డ్
3) హైదరాబాద్ టెలిగ్రాఫ్
4) జూబ్దుత్ ఉల్ అక్బార్
- View Answer
- సమాధానం: 2
22. 1892లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆర్య సమాజ్ శాఖకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎవరు వ్యవహరించారు?
1) కంటప్రసాద్, లక్ష్మణ్దేశ్జీ
2) లక్ష్మణ్దేశ్జీ, కంటప్రసాద్
3) కంటప్రసాద్, రామచంద్ర పిళ్లై
4) రామచంద్ర పిళ్లై, లక్ష్మణ్దేశ్జీ
- View Answer
- సమాధానం: 1
23. హైదరాబాద్‌లో తొలిసారిగా గణేశ్ ఉత్సవాలను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1895
2) 1899
3) 1897
4) 1890
- View Answer
- సమాధానం: 3
24. 1918లో 'హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ'ని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
1) వామన్ నాయక్
2) రావి నారాయణ రెడ్డి
3) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
4) రామచంద్ర పిళ్లై
- View Answer
- సమాధానం: 1
25. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) 1938 సెప్టెంబర్ 7న ప్రభుత్వం దీన్ని నిషేధించింది
2) 1946లో ప్రభుత్వం దీనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది
3) ప్రథమ మహాసభను 1947 మేలో నిర్వహించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో ఏ తేదీన విలీనం చేశారు?
1) 1941 సెప్టెంబర్ 13
2) 1947 సెప్టెంబర్ 17
3) 1948 సెప్టెంబర్ 17
4) 1947 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: 3
27. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్' సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1925
2) 1929
3) 1923
4) 1927
- View Answer
- సమాధానం: 4
28. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్' సంస్థకు తొలి అధ్యక్షుడు ఎవరు?
1) నవాబ్ సదర్‌యార్ జంగ్
2) మౌల్వీ అబ్దుల్ ఖాదర్
3) సయ్యద్ మహమ్మద్ హసన్
4) కాశీం రజ్వీ
- View Answer
- సమాధానం: 1
29. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్' సంస్థకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ సంస్థకు తొలి అధ్యక్షుడు నవాబ్ సదర్‌యార్ జంగ్
2) 1938లో ప్రొఫెసర్ మౌల్వీ అబ్దుల్ ఖాదర్ అధ్యక్షుడయ్యాడు
3) 1939లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
చదవండి: Mughal History Bitbank in Telugu: మొగలులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు ఎన్నేళ్లు పాలించారు?
30. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్'కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) నవాబ్ బహదూర్ యార్ జంగ్ 'నేను పాలకున్ని' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు
2) బహదూర్ అలీజంగ్ రజాకార్ వ్యవస్థకు రూపమిచ్చాడు
3) దీనికి 1946లో కాశీం రజ్వీ అధ్యక్షుడయ్యాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
31. 'ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్' సంస్థకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ సంస్థ హరిజనులను ముస్లింలుగా మార్చే ప్రక్రియ మొదలుపెట్టింది
2) హైదరాబాద్‌లో జాతీయోద్యమాన్ని జరగనివ్వబోమని ప్రకటించింది
3) ఈ సంస్థకు నిజాం పరోక్షంగా సహకరించాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. రచనలు - రచయితలకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
1) నరసింహ శతకం - ధర్మపురి శేషాచల కవి
2) శ్రీకృష్ణ శతకం - కాకుత్సుం నరసింహ కవి
3) అలివేలు మంగా పరిణయం - తూము రాంచంద్రారెడ్డి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
33. నిజాం ప్రభుత్వం వందేమాతర ఉద్యమాన్ని నిషేధించిన తేదీ ఏది?
1) 1937 నవంబర్ 28
2) 1938 నవంబర్ 28
3) 1937 అక్టోబర్ 20
4) 1938 అక్టోబర్ 20
- View Answer
- సమాధానం: 2
34. హైదరాబాద్‌లో 'కామ్రేడ్స్ అసోసియేషన్'సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1939
2) 1937
3) 1940
4) 1935
- View Answer
- సమాధానం: 1
35. 'ఆహారపు రేషన్.. ప్రజల ప్రజాతంత్ర హక్కు' అని పేర్కొంటూ కరపత్రాన్ని వేసిన సంస్థ ఏది?
1) ఆంధ్ర మహాసభ
2) కిసాన్ సభ
3) కామ్రేడ్స్ అసోసియేషన్
4) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
- View Answer
- సమాధానం: 3
36. 10వ ఆంధ్ర మహాసభలో.. ప్రజలకు తిండి ప్రధాన అవసరం అని పేర్కొని తొలిసారిగా వర్గ పోరాటం గురించి ఎవరు ప్రస్తావించారు?
1) çసరోజినీ నాయుడు
2) రావి నారాయణ రెడ్డి
3) డాక్టర్ జయసూర్య
4) దేవులపల్లి వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 3
37. వందేమాతర ఉద్యమం నిర్వహించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం బహిష్కరించిన విద్యార్థులు ఏ విశ్వవిద్యాలయంలో చేరారు?
1) ఆర్ట్స్ విద్యార్థులు జబల్పూర్, సైన్స్ విద్యార్థులు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరారు
2) అన్నామలై విశ్వవిద్యాలయంలో చేరారు
3) బెనారస్ విశ్వవిద్యాలయంలో చేరారు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
38. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) 1940లో 'నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ'ని ఏర్పాటు చేశారు
2) 1940లో కమ్యూనిస్టు పార్టీ 'కిసాన్ సభ'ను స్థాపించింది
3) 1940లో తునికిపాడులో చండ్ర రాజేశ్వరరావు రాజకీయ పాఠశాలను నిర్వహించాడు
4) 1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు
- View Answer
- సమాధానం: 4
39. 'నలచరిత్ర' గ్రంథకర్త ఎవరు?
1) సిరిప్రగడ ధర్మన్న
2) మల్లికార్జున సిద్ధయోగి
3) కాణాదం పెద్దన
4) ఇద్దాసు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
40. 'అభినవ పెద్దన'గా ఎవరిని పేర్కొంటారు?
1) సిరిప్రగడ ధర్మన్న
2) తిమ్మ భూపాలుడు
3) కాణాదం పెద్దన సోమయాజి
4) మల్లికార్జున సిద్ధయోగి
- View Answer
- సమాధానం: 3
41. కింద పేర్కొన్న వారిలో గౌడ పురాణాన్ని ద్విపదగా రాసింది ఎవరు?
1) మల్లికార్జున సిద్ధయోగి
2) సిరిప్రగడ ధర్మన్న
3) తిమ్మ భూపాలుడు
4) కాణాదం పెద్దన సోమయాజి
- View Answer
- సమాధానం: 1
42. పరశురామ పంతుల లింగమూర్తి రాసిన వేదాంత గ్రంథం ఏది?
1) అలివేలు మంగా పరిణయం
2) కంబుకందర చరిత్ర
3) శ్రీకృష్ణ శతకం
4) సీతారామాంజనేయ సంవాదం
- View Answer
- సమాధానం: 4
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి,
'తెలంగాణ చరిత్ర' రచయిత