Telangana History Bitbank in Telugu: తొలి ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
1. 1950 జవవరి 26న ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏ కేటగిరీలో చేర్చారు?
1) A
2) B
3) C
4) D
- View Answer
- సమాధానం: 2
2. భారత రాజ్యాంగాన్ని ఆమోదించక ముందు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ హోదాలో కొనసాగారు?
1) గవర్నర్
2) గవర్నర్ జనరల్
3) రాజ్యాంగ పరిరక్షకుడు
4) రాజ్‌ప్రముఖ్
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారిగా ఎన్నికల ద్వారా పౌర ప్రభుత్వం ఏర్పడింది.
2) 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని మరట్వాడా, కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
3) హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ కూటమి ఆధిక్యం సాధించింది.
4) 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో పి.డి.ఎఫ్. కూటమి అధికారంలోకి వచ్చింది.
- View Answer
- సమాధానం: 4
4. 1952లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులు, వారికి కేటాయించిన శాఖలను జతపరచండి.
జాబితా - I
i) వి.బి. రాజు
ii) జి.ఎస్. మెల్కోటె
iii) కె.వి. రంగారెడ్డి
iv) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
జాబితా - II
a) ఆర్థిక శాఖ
b) కస్టమ్స్, అబ్కారీ శాఖ
c) కార్మిక, పునరావాస శాఖ
d) ఆహార, వ్యవసాయ శాఖ
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-a, ii-d, iii-b, iv-c
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 3
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: 'ధీరజన మనోవిరాజితం' రచయిత ఎవరు?
5. 1952లో శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానంలో ఏ రాష్ట్రానికి చెందిన నాన్-ముల్కీలను పోలీసు శాఖలో ఎక్కువగా నియమించారని తెలిపారు?
1) బొంబాయి
2) మధ్యప్రదేశ్
3) మద్రాసు
4) ఆంధ్ర
- View Answer
- సమాధానం: 3
6. హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
1) నల్లగొండ
2) ఖమ్మం
3) వరంగల్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
7. 1952లో ముల్కీ ఉద్యమం ప్రారంభమవడానికి దారితీసిన సంఘటనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) స్థానిక ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేయడం
2) అయ్యదేవర కాళేశ్వరరావు తన ప్రసంగంలో తెలంగాణ ప్రాంతం వారిని అవమానించడం
3) ముల్కీ సమస్యపై విచారణకు మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి.. తన హామీని సకాలంలో నెరవేర్చకపోవడం
4) విద్యార్థి కార్యాచరణ సంఘం నేత బుచ్చయ్యను పోలీసులు గాయపరచడం
- View Answer
- సమాధానం: 4
8. ముల్కీ ఉద్యమ సందర్భంగా 1952 సెప్టెంబర్ 3న జరిగిన కాల్పుల సమయంలో పోలీసు కమిషనర్ ఎవరు?
1) రాంలాల్
2) శివకుమార్‌లాల్
3) అబ్దుల్ ఖాదర్
4) మహమ్మద్ కాశీం
- View Answer
- సమాధానం: 2
9. ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించిన జస్టిస్ జగన్మోహన్రెడ్డి కమిషన్.. తన నివేదికలో పేర్కొన్న అంశాల్లో సరికానిది ఏది?
1) పోలీసు కాల్పుల్లో మరణించిన, అంగవైకల్యం పొందిన అమాయకులకు ప్రభుత్వం న్యాయమని భావిస్తే పరిహారం చెల్లించాలి
2) సెప్టెంబర్ 3న పోలీసు కాల్పులకు ముందు 30 నుంచి 40 వేల మంది జనం ఆందోళనల్లో పాల్గొన్నారు.
3) పోలీసు ఆదేశాలను ఆందోళనాకారులు ధిక్కరించడం వల్ల లాఠీ చార్జీ, బాష్పవాయువును ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరపడం సమర్థనీయమే.
4) ముల్కీ ఆందోళనకు కారణమైన విద్యాశాఖ అధికారి పార్థసారథిని ఉద్యోగం నుంచి తొలగించాలి.
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana (అసఫ్జాహీలు)History Bitbank in Telugu: మీర్ ఆలం చెరువును ఎప్పుడు నిర్మించారు?
10. 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో తొలిసారి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు.
2) విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడిగా కొత్తపల్లి జయశంకర్ వ్యవహరించారు.
3) సిటీ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
4) కాల్పుల్లో మరణించిన ఇద్దరి శవాలను వారి కుటుంబ సభ్యులకు తెలపకుండా పోలీసులు అర్ధరాత్రి ఖననం చేశారు.
- View Answer
- సమాధానం: 4
11. భారత ప్రభుత్వం 'స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్.ఆర్.సి.)'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
1) 1952
2) 1953
3) 1954
4) 1955
- View Answer
- సమాధానం: 2
12. కింద పేర్కొన్న వారిలో 'స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్'లో సభ్యుడు కానిది ఎవరు?
1) కె.ఎం. ఫణిక్కర్
2) జస్టిస్ వాంఛూ
3) హృదయనాథ్ కుంజ్రూ
4) ఫజల్ అలీ
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ప్రత్యేక తెలంగాణకు సిఫారసు చేయాలని సీపీఐ శాసనసభ్యులు రావి నారాయణరెడ్డి సారథ్యంలో ఎస్.ఆర్.సి. సభ్యులను కోరారు
2) హైదరాబాద్ విభజన సరికాదని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఎస్.ఆర్.సి. ఎదుట వాదించారు
3) ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రజాకవి కాళోజీ, దాశరథి, వరవరరావు ఎస్.ఆర్.సి.కి వినతిపత్రం సమర్పించారు
4) ఎస్.ఆర్.సి. సభ్యులు కరీంనగర్, వరంగల్‌లో పర్యటించి ప్రజలు, విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు
- View Answer
- సమాధానం: 4
14. ఎస్.ఆర్.సి. సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) బీదర్ సహా తెలంగాణ ప్రాంత జిల్లాలను హైదరాబాద్ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి.
2) హైదరాబాద్, విదర్భతోపాటు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలి.
3) కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాలను నల్లగొండ జిల్లాలో చేర్చాలి.
4) చాందా జిల్లాలోని సిరోంచ తహసీల్‌లో 51.2 శాతం ప్రజలు తెలుగు మాట్లాడే వారు ఉన్నందువల్ల దాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చాలి.
- View Answer
- సమాధానం: 4
15. ఎస్.ఆర్.సి. నివేదిక సిఫారసుల ఆధారంగా కింది ప్రాంతాలను జతపరచండి.
జాబితా - I
i) గుల్బర్గా
ii) పర్బనీ
iii) బీదర్
iv) నాగ్‌పూర్
జాబితా - II
a) విదర్భ
b) బొంబాయి
c) హైదరాబాద్
d) మైసూర్
1) i-d, ii-b, iii-c, iv-a
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-a, ii-c, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 1
16. 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్స్' పుస్తకంలో ఎస్.ఆర్.సి., చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి అంబేడ్కర్ వెల్లడించిన అభిప్రాయాల్లో సరికానిది ఏది?
1) కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమే రా ష్ట్రాల నిర్మాణం జరగడం శ్రేయస్కరం కాదు
2) ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉండాలి. కానీ ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చు.
3) మధ్యప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలి
4) హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించకూడదు
- View Answer
- సమాధానం: 4
17. నాయకులు - ఎస్.ఆర్.సి. సిఫారసులపై చేసిన వ్యాఖ్యలను జతపరచండి.
జాబితా - I
i) అయ్యదేవర కాళేశ్వర రావు
ii) కొండా వెంకట రంగారెడ్డి
iii) కొత్త రఘురామయ్య
iv) పాగ పుల్లారెడ్డి
జాబితా - II
a) ఎస్.ఆర్.సి. రాజకీయ చతురతను, దూరదృష్టిని చూపింది
b) ఎస్.ఆర్.సి. ఆంధ్రులకు అన్యాయం చేసింది
c) విశాలాంధ్ర సమస్యను అయిదేళ్లు వాయిదా వేయడం సరికాదు
d) నివేదిక సంతోషాన్ని కల్గించింది
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-a, ii-d, iii-b, iv-c
4) i-b, ii-d, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 2
18. ఎస్.ఆర్.సి. నివేదికపై వెల్లడించిన ప్రకటనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) రాష్ట్రాలు సంప్రదించుకొని పునర్విభజన విషయంలో ఎస్.ఆర్.సి. సిఫారసుల్లో తగిన మార్పులు చేసుకోవచ్చునని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది
2) హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని 1955 అక్టోబర్‌లో పి.డి.ఎఫ్. నిర్ణయించింది
3) ఎస్.ఆర్.సి. సిఫారసులను స్థూలంగా ఆమోదించాలని బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు
4) హైదరాబాద్ నగర కాంగ్రెస్ 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు'కు తీర్మానం చేసింది
- View Answer
- సమాధానం: 4
19. ఎస్.ఆర్.సి. నివేదికపై.. 'ప్రత్యేక తెలంగాణ ఎప్పటికీ బలిష్టంగా ఉండలేదు. దేశం మధ్యలో ఇలాంటి బలహీన రాష్ట్రం ఉండటం ప్రమాద కరం'అని వ్యాఖ్యానించిన నాయకుడు ఎవరు?
1) నీలం సంజీవరెడ్డి
2) టంగుటూరి ప్రకాశం
3) స్వామి రామానంద తీర్థ
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Mughal History Bitbank in Telugu: మొగలులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు ఎన్నేళ్లు పాలించారు?
20. ఎస్.ఆర్.సి. నివేదికను వెల్లడించిన సమయంలో కేంద్ర హోం మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
2) మొరార్జీ దేశాయ్
3) గోవింద వల్లభ్‌పంత్
4) వై.బి. చవాన్
- View Answer
- సమాధానం: 3
21. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) దేబర్
3) కామరాజ్ నాడార్
4) నిజలింగప్ప
- View Answer
- సమాధానం: 2
22. హైదరాబాద్ విభజనను మొదటి నుంచి వ్యతిరేకించిన నెహ్రూ.. 1956లో సమర్థించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏది?
1) ఎస్.ఆర్.సి. నివేదిక విశాలాంధ్ర ఏర్పాటుకు సిఫారసు చేయడం
2) నెహ్రూపై బూర్గుల రామకృష్ణారావు చేసిన ఒత్తిడి
3) నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామని అల్టిమేటం ఇవ్వడం
4) యు.ఎన్.ఒ. సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాం దాఖలు చేసిన పిటిషన్ ఎజెండాలో ఉండటం
- View Answer
- సమాధానం: 4
23. 'సూరి భగవంతం ఉస్మానియా వి.సి. అయిన తర్వాత 10 నుంచి 15 మంది ఆంధ్రా లెక్చరర్లను నియమించారు' అని హైదరాబాద్ శాసనసభలో పేర్కొన్నవారెవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) కె. రాజమల్లు
3) టి. అంజయ్య
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: 2
24. 'శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు,స్కాటిష్ డెవల్యూషన్ లాంటి రాజ్యాంగ సాధనాలు.. తెలంగాణ అవసరాలను తీర్చడంలో పనిచేయలేవు' అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి
2) కొండా వెంకట రంగారెడ్డి
3) ప్రొఫెసర్ జయశంకర్
4) ఎస్.ఆర్.సి. నివేదిక
- View Answer
- సమాధానం: 4
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: మక్కా మసీదుకు పునాది వేసిన రాజు ఎవరు?
25. 'ఆంధ్రుల రథం సాగింది. ఇది హైదరాబాద్ వెళ్లే వరకు నిలువదు.మధ్యలో కందెన కోసం కర్నూలులో ఆగింది' అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) అయ్యదేవర కాళేశ్వరరావు
2) మాడపాటి హన్మంతరావు
3) మాడభూషి అనంతశయనం అయ్యంగార్
4) అరవముడుం అయ్యంగార్
- View Answer
- సమాధానం: 3
26. 'విశాల శబ్దం దురాక్రమణ చింత ఉన్న సామ్రాజ్యవాదాన్ని çస్ఫురింపజేస్తోంది' అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) కొండా వెంకట రంగారెడ్డి
3) జె.వి. నర్సింగరావు
4) పైన పేర్కొన్న వారెవరూ కాదు
- View Answer
- సమాధానం: 4
27. 'పాలనా కోణంలో చూస్తే.. ఆంధ్రతో ఐక్యం కావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒనగూరే అదనపు ప్రయోజనాలేవీ లేవు' అని వ్యాఖ్యానించింది?
1) ఆనందరావు తోట
2) జవహర్లాల్ నెహ్రూ
3) ఎస్.ఆర్.సి. నివేదిక
4) ప్రొఫెసర్ జయశంకర్
- View Answer
- సమాధానం: 3
28. రాష్ట్రాల స్వరూప, స్వభావాల్లో సమతౌల్యం ఉండాలంటూ.. 'జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనం' అనే మూడు కొలమానాలను సూచించింది?
1) బి.ఆర్. అంబేడ్కర్
2)ఎస్.ఆర్.సి.నివేదిక
3) జవహర్లాల్ నెహ్రూ
4) థార్ కమిటీ
- View Answer
- సమాధానం: 1
29. 'ఐక్యరాజ్య సమితి ఎదుట హైదరాబాద్ సమస్య ఉండి, ఎప్పటికీ తలనొప్పిగా మారడంతో ఈ బెడదను వదిలించుకోవడానికి యూనియన్ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అంతేగానీ భాషా రాష్ట్రాలపై అభిమానం ఉండటం వల్ల కానీ, ఈ విషయంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం వల్ల కానీ ఇది జరగలేదు' అని ఏ నాయకుడు తాను రాసిన చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) దేవులపల్లి వెంకటేశ్వరరావు
3) రావి నారాయణరెడ్డి
4) ప్రొఫెసర్ జయశంకర్
- View Answer
- సమాధానం: 2
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
30. జతపరచండి.
జాబితా - I
i) నిజాం సబ్జెక్ట్స్ లీగ్
ii) దక్కనీ సింథసెస్
iii) చీఫ్ ఇంజనీర్
iv) హైదరాబాద్ అసోసియేషన్
జాబితా - II
a) నవాబ్ అలీ నవాజ్ జంగ్
b) సయ్యద్ అబిద్ హసన్
c) శ్రీకిషన్
d) డాక్టర్ జోర్
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1