Skip to main content

Indian Book of Records: ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన శ్రీసాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామానికి చెందిన కొమ్మూరి షణ్ముఖ శ్రీసాయి అనే యువకుడు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో తన అద్భుత ప్రతిభతో ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
Kommuri Shanmukha Sri Sai in the Indian Book of Records

సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్‌లో సైబర్‌ దాడులు గుర్తించి వాటికి పరిష్కారాలు తెలియజేయడం వంటివి విజయవంతంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది. 

గత ఆరు నెలల్లో ఐజీసీఏఆర్‌, ఐఐఐటీ బెంగుళూరు, ఐఐటీ ముంబై, ఐఐటీ మద్రాస్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ సైట్స్‌, 50 ప్రముఖ కంపెనీలలో ఉన్న లోపాలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపినందుకు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాలలోని 40కి పైగా సంస్థలలో ఉన్న లోపాలను గుర్తించి ఆ సంస్థలకు తెలియజేశాడు. 

ఇసి కౌన్సిల్‌–2024లో ప్రపంచ దేశాలలో ఉన్న హాకర్స్‌ జాబితాలో శ్రీసాయి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానున్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సైబర్‌ రీసెర్చింగ్‌ సమ్మిట్‌కు శ్రీసాయికి ఆహ్వానం అందింది. 

Kristi Shikha: పాటలు పాడి స్థానం సంపాదించిన కృతి శిఖా.. ఎందులో అంటే..

Published date : 04 Jul 2024 10:05AM

Photo Stories