Skip to main content

Roger Federer Retires: టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్విస్‌ స్టార్‌

ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.
 Roger Federer Retires
Roger Federer Retires

ఈ నెల 23నుంచి 25 వరకు లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్‌ టెన్నిస్‌నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. 

Also read: 2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు

1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్విట్జర్లాండ్‌ స్టార్‌ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్‌ ఆడాడు. వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలండ్‌) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్‌ పట్టుకోలేదు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ఫెడరర్‌ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్‌ (22), జొకోవిచ్‌ (21) అధిగమించారు.  

Also read: BCCI అధ్యక్ష, కార్యదర్శులు ఆరేళ్లపాటు పని చేయవచ్చు: సుప్రీం కోర్టు

కెరీర్‌ స్లామ్‌ పూర్తి
ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్‌ కెరీర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఎప్పుడూ సవాల్‌గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌లోకి ఫెడరర్‌ అడుగు పెట్టాడు. మరో టైటిల్‌ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్‌ సంప్రాస్‌ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్‌ సాధించిన నాదల్‌ జోరు కొనసాగుతోంది. ఈ దశలో ఫెడరర్‌కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్‌ ఫైనల్లో సొదర్లింగ్‌ చేతిలో నాదల్‌ అనూహ్యంగా ఓడటంతో రోజర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్‌నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించాడు. తన ‘కెరీర్‌ స్లామ్‌’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్‌తో సమంగా నిలిచాడు. 

Also read: US Open 2022 Men's Singles: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్న స్పెయిన్‌ టీనేజర్‌

 

  • కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్‌ – 103  
  • గెలుపు–ఓటములు – 1251–275 
  • కెరీర్‌ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) 
  • తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ – 02/02/2004 
  • ఒలింపిక్‌ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్‌ కాంస్యం
  • వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ – మొత్తం 310 వారాలు        (ఇందులో వరుసగా 237 వారాలు)  
  • గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయాల సంఖ్య – 369  
  • కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు – 11,478 

Also read: Australia-Newzealand Series: ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌.. Australia captain Aaron Finch వన్డే కెరీర్‌కు వీడ్కోలు

‘గ్రాండ్‌’ ఫెడెక్స్‌ 
ఆ్రస్టేలియా ఓపెన్‌ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 
ఫ్రెంచ్‌ ఓపెన్‌ (1) – 2009 
వింబుల్డన్‌ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 
యూఎస్‌ ఓపెన్‌ (5) – 2004, 2005, 2006, 2007, 2008 
తన కెరీర్‌ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్‌ ఒక్కసారి కూడా మ్యాచ్‌ మధ్యలో రిటైర్‌ కాలేదు.  

Also read: 2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 16 Sep 2022 05:56PM

Photo Stories