Skip to main content

US Open 2022 Men's Singles: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్న స్పెయిన్‌ టీనేజర్‌

కార్లోస్‌ అల్‌కరాజ్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల ఈ స్పెయిన్‌ టీనేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించాడు.
Carlos Alcaraz vs Casper Ruud, US Open Men's Singles
Carlos Alcaraz vs Casper Ruud, US Open Men's Singles

సెప్టెంబర్ 12న దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 6–4, 2–6, 7–6 (7/1), 6–3తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడంతోపాటు సెప్టెంబర్ 12న విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.

Also read: Iga Swiatek: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచిన మొదటి పోలిష్ టెన్నిస్‌ స్టార్‌

రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ ఐదు స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... 

రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Also read: Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం

అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో టైటిల్‌ నెగ్గగా... కాస్పర్‌ రూడ్‌కు రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనూ ఓటమి ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ చేతిలో కాస్పర్‌ రూడ్‌ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. నాదల్‌ (19 ఏళ్లు; 2005లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా... సంప్రాస్‌ (19 ఏళ్లు; 1990లో యూఎస్‌ ఓపెన్‌) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు.  


Also read: 2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

  • ఈ ఏడాది అల్‌కరాజ్‌ సాధించిన టైటిల్స్‌ (రియో డి జనీరో, మయామి, బార్సిలోనా, మాడ్రిడ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌).
  • ఈ సంవత్సరం అల్‌కరాజ్‌ మొత్తం 60 మ్యాచ్‌లు 
  • ఆడి 51 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో అతను ఓడిపోయాడు. 
  • కార్లోస్‌ మోయా (1999), కార్లోస్‌ ఫెరీరో (2003), రాఫెల్‌ నాదల్‌ (2008) తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న నాలుగో స్పెయిన్‌ ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ నిలిచాడు. ప్రస్తుతం అల్‌కరాజ్‌ కోచ్‌ గా ఉన్న ఫెరీరో 2003లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓటమి తర్వాత వరల్డ్‌ నంబర్‌వన్‌ కాగా అల్‌కరాజ్‌ టైటిల్‌ సాధించి టాప్‌ ర్యాంకర్‌ కావడం విశేషం. 
  • టెన్నిస్‌లో ర్యాంకింగ్స్‌ (1973) ప్రవేశపెట్టాక టాప్‌ ర్యాంక్‌ అందుకున్న అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్‌ రికార్డు నెలకొల్పాడు.  

Also read: Italian Grand Prix: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో 11వ విజయం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Sep 2022 06:59PM

Photo Stories