Skip to main content

Italian Grand Prix: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో 11వ విజయం

 రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో 11వ విజయాన్ని సాధించాడు.
Max Verstappen booed after Italian Grand Prix win
Max Verstappen booed after Italian Grand Prix win

సెప్టెంబర్ 11 నజరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచి వరుసగా ఐదో విజయం నమోదు చేశాడు. 12వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన వెర్‌స్టాపెన్‌ అదే జోరులో నిర్ణిత 53 ల్యాప్‌ల రేసును గంటా 20 నిమిషాల 27.511 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం వెర్‌స్టాపెన్‌ 335 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లెక్‌లెర్క్‌ 219 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

Also read: Virat Kohli: మెరుపు శతకంతో చెలరేగిన కోహ్లి

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:32PM

Photo Stories