Skip to main content

Virat Kohli: మెరుపు శతకంతో చెలరేగిన కోహ్లి

- అఫ్గాన్‌పై 101 పరుగులతో భారత్‌ ఘనవిజయం
Virat Kohli Finally Ends Century Drought
Virat Kohli Finally Ends Century Drought

విరాట్‌ కోహ్లి (61 బంతుల్లో 122 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతర్జాతీయ టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఆసియా కప్‌ను భారత్‌ విజయంతో ముగించింది. ‘సూపర్‌–4’లోని తమ ఆఖరి పోరులో భారత్‌ 101 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది.  

Also read: BWF Singles Women Rankings: జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా అనుపమ
 
టి20ల్లో భారత్‌ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. టీమిండియా ఆటగాళ్లు 10 సెంచరీలు నమోదు చేయగా కోహ్లికంటే ముందు రోహిత్‌ (4 సెంచరీలు), రాహుల్‌ (2), రైనా, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఘనత సాధించారు.  

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్‌ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. 

సచిన్‌ (100) అగ్రస్థానంలో ఉన్నాడు.  

Also read: Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం

అంతర్జాతీయ టి20ల్లో కోహ్లికి ఇది తొలి సెంచరీ. గతంలో 94 నాటౌట్‌ (హైదరాబాద్‌లో, వెస్టిండీస్‌పై–2019 డిసెంబర్‌ 6) అతని అత్యధిక స్కోరు. 

ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్‌ 23న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ సాధించాడు.  

Also read: Indian Football: భారత ఫుట్‌బాల్‌పై నిషేధం ఎత్తివేత

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 09 Sep 2022 05:49PM

Photo Stories