2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు
మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 28 ఏళ్ల వినేశ్ రికార్డు నెలకొల్పింది.
Also read: Neeraj Chopra: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం
2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ వినేశ్ కాంస్య పతకం సాధించింది. సెప్టెంబర్ 14న జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్‌లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్‌గ్రెన్ (స్వీడన్)పై గెలిచింది.
Also read: Quiz of The Day (September 15, 2022): ఏ చెట్టును ‘ప్రాక్ దేశపు రాజ్య వృక్షం’ అని పిలుస్తారు?
కాంస్యం రేసులో నిషా
మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్‌లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్‌లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 14th కరెంట్ అఫైర్స్
2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరిత మోర్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–7తో లిసాక్ అన్‌హెలినా (పోలాండ్) చేతిలో... మాన్సి అహ్లావత్ క్వార్టర్ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్) చేతిలో... రితిక తొలి రౌండ్‌లో 2–6తో కెండ్రా అగస్టీన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP