Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 14th కరెంట్ అఫైర్స్
TS: మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు
సెప్టెంబర్ 13న మంత్రి హరీశ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ(పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. హరీశ్ మాట్లాడుతూ గతంలో వైద్య విద్య లో పనిచేసే అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచామన్నారు. ప్రొఫెసర్ల నుంచే మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాళ్లుగా, వైద్య విద్య డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్లుగా నియమిస్తున్నా, వారి వయో పరిమితిని పెంచలేదన్నారు. ఇప్పుడు సవరణ ప్రతిపాదించామని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) కూడా 70 ఏళ్ల వరకు పెంచుకోవచ్చని చెప్పిందన్నారు.
Also read: Quiz of The Day (September 14, 2022): కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?
Fundamental Right: ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల్లో పోటీచేయడం ప్రాథమిక హక్కు, చట్టపరమైన హక్కు పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ మేరకు వాదించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల్లో పోటీ చేయడమనేది శాసనం ద్వారా అమలయ్యే హక్కు మాత్రమే. ఎన్నిక స్వభావాన్ని బట్టి అభ్యర్థిని బలపరిచే, ప్రతిపాదించే వారికి సంబంధించిన విధి నిషేధాలు, నియమ నిబంధనలు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నాయి’’ అని గుర్తు చేసింది. ప్రపోజర్ లేని కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తనను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇది తన ప్రాథమిక హక్కును హరించడమేనన్న వాదనను తోసిపుచింది.
Telangana National Integration Day: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతున్న శుభసందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి 18వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
First Manned Space Launch: ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం: కేంద్రం
భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సెప్టెంబర్ 13న వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు. రష్యాలో వ్యోమగాముల శిక్షణ కూడా కరోనా వల్లే వాయిదా పడిందన్నారు. ‘‘గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగ పరీక్ష ఈ ఏడాది చివర్లో ఉంటుంది. అంతరిక్ష నౌకను 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగిస్తారు. క్యాప్సూల్‌ను పారాచ్యూట్ల సాయంతో భూమిపైకి తీసుకొస్తారు. రెండోసారి అంతరిక్ష నౌకను మరింత ఎత్తుకు తీసుకెళ్తారు’’ అని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది చేపట్టే మరో యాత్రలో మహిళ ముఖ కవళికలుండే వ్యోమ్ మిత్ర అనే హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని మంత్రి తెలిపారు.
Bilateral trade: రూపాయి ‘వాణిజ్యం’పై దేశాల ఆసక్తి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికి మించి స్వేచ్ఛా విపణిగా మారగలుగుతోందని మైండ్‌మైన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మహమ్మారి అనంతరం భారత్ అనేక వినూత్న ప్రయోగాలను ఆవిష్కరిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
MCED blood test: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం.
ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా!
ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమరి్పంచింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు.
ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Bill & Melinda Gates Foundation: కోవిడ్ కట్టడిలో భారత్ భేష్
కరోనా వైరస్ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్ ఈ విషయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్‌మాన్ వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్) నివేదిక విడుదల సందర్భంగా సెప్టెంబర్ 13న ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్ మహమ్మారి అదుపులో భారత్ విజయం సాధించింది. కోవిడ్ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం.
ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలపై ఆడిట్
కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమరి్పంచింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది.
Emergency Medicines: అందుబాటు ధరల్లోకి క్యాన్సర్ మందులు.. 26 డ్రగ్స్‌ను తొలగింపు.. జాబితాలోకి మరో 34 డ్రగ్స్
యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్ సహా 34 డ్రగ్స్‌ను జాతీయ అత్యావశ్యక ఔషధాల జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం)లోకి కేంద్రంచేర్చింది. దాంతో వీటి ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు 384 జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సెప్టెంబర్ 13న విడుదల చేశారు.
Also read: WHO: ఇష్టారాజ్యంగా యాంటీ‘భయో’టిక్స్!.. నిజంగా అవసరమైనప్పుడు మందులు పనిచేయవంటున్న అధ్యయనాలు
ఐవర్‌మెక్టిన్, అమికాసిన్, బెడాక్లిలైన్, డెలామనిడ్, ముపిరోసిన్, మెరోపెనెమ్ వంటివి వీటిలో ఉన్నాయి. బెండామస్టీన్ హైడ్రోక్లోరైడ్, ఇరినోటెకాన్ హెచ్‌సీఐ ట్రైహైడ్రేడ్, లెనాలిడోమైడ్, లియూప్రోలైడ్ ఎసిటేట్ వంటి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, బుప్రినోరిఫెన్ వంటి మానసిక చికిత్స ఔషధాలనూ జాబితాలో చేర్చారు. ర్యాంటిడిన్, సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలియం, ఎటినోలోల్, మైథెల్‌డోపా సహా 26 డ్రగ్స్‌ను తొలగించారు. 1996 నుంచి ఈ జాబితాను కేంద్రం అమలుచేస్తోంది. 2003, 2011, 2015ల్లో దీన్ని సవరించారు. ఆరోగ్య సంరక్షణలో అన్ని స్థాయిల్లోనూ సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడంలో ఎన్‌ఎల్‌ఈఎంది పెద్ద పాత్ర అని మంత్రి అన్నారు. ఎండోక్రైన్ మెడిసిన్, కాంట్రాసెప్టివ్స్ ఫుడ్రోకార్టిసోన్, ఓర్లీలోక్సిఫిన్, ఇన్సులిన్ గ్లార్జైన్, టెనిలిగ్లిటిన్, శ్వాస వ్యవస్థ సంబంధ మోంటేలూకాస్ట్, నేత్ర సంబంధ లాటనోప్రోస్ట్‌లనూ జాబితాలో చేర్చారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 13th కరెంట్ అఫైర్స్
CMIE Reports: నిరుద్యోగం పైపైకి.. యువత, మహిళలపై తీవ్ర ప్రభావం
ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది.
Also read: TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22
రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం
రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశీ్మర్‌లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి.
Also read: Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!
40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్
కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది.
Also read: UNDP Rankings: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి... భారత్ స్థానం ఎంతంటే?
US కాన్సుల్ జనరల్‌గా జెన్నీఫర్ లార్సన్
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని యూఎస్ కాన్సులేట్ డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా, యాక్టింగ్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్ లార్సన్ తాజాగా హైదరాబాద్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉమ్మడి మిలిటరీ విన్యాసాల వంటి అనేక అంశాల్లో అమెరికా–భారత్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయన్నారు.
Also read: Supreme Court New Chief Justice: సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా లలిత్
దాదాపు 19 ఏళ్లపాటు దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవమున్న జెన్నిఫర్.. లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సూడాన్, జెరూసలేం, లెబనాన్‌లలో పనిచేశారు. అంతకుముందు నేషనల్ పబ్లిక్ రేడియోలో ఓ టాక్ షో నిర్మాతగా వ్యవహరించారు. ‘అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లోని సాహిత్యాల్లో పోలికలు’, ‘మధ్యప్రాచ్య’అంశాలపై కాలిఫోర్నియా వర్సిటీలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించారు.
Also read: Samir V Kamat: డీఆర్‌డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
State High Court: GO 111లోని ఆంక్షలు అమల్లోనే..
జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరిపరిరక్షణకు ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించే వరకు 1996లో వెలువడిన జీవో 111లోని నిషేధాజ్ఞలు అమల్లోనే ఉంటాయని రాష్ట ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కొన్ని వెసులుబాటులు కల్పిస్తూ, జలాశయాల రక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో 69 జారీ చేసినా క్రితం జీవో అమల్లోనే ఉందని స్పష్టం చేసింది. జీవో నంబర్ 111 ఎత్తివేత, జంట జలాశయాల రక్షణకు సంబంధించి దాఖలైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కౌంటర్ దాఖలు చేసింది. జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించాల్సి ఉండగా.. ఆక్రమణలు, నిర్మాణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది జీవో 111ను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని డా.జీవానందరెడ్డి 2007లో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సెప్టెంబర్ 13న విచారణ చేపట్టగా.. ప్రభుత్వం తరఫున మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు.
Also read: SCO Summit: ఎస్సీఓ సదస్సుకు జిన్‌పింగ్, మోదీ, పుతిన్ సైతం హాజరయ్యే అవకాశం
కౌంటర్ అఫిడవిట్‌లోని వివరాలు
‘ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమల్లోనే ఉంటాయి. జంట జలాశయాల ఎఫ్‌టీఎల్‌కు 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలకు వర్తించే ఆంక్షలన్నీ కొనసాగుతాయి. జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యర్థ, మురుగు జలాలు చేరకుండా ఏర్పాట్లు, వాటి మళ్లింపునకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, గ్రీన్ జోన్ల ఏర్పాటు, లే–అవుట్లు, కొత్త నిర్మాణాలకు అనుమతులు.. తదితర అంశాలపై కమిటీ నివేదిక అందజేయనుంది’అని వివరించింది.
DPIIT's July report: పెట్టుబడుల ఆకర్షణలో APనే అగ్రగామి
పారిశ్రామిక పెట్టుబడులను అకర్షించడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అతి పెద్ద ఘనత సాధించింది. 2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)జూలై నెల నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి విషయం వెల్లడైంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. రూ.36,828 కోట్ల పెట్టుబడులతో ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల్లో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది.
Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP