Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 13th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 13th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 13th 2022
Current Affairs in Telugu September 13th 2022

SCO Summit: ఎస్సీఓ సదస్సుకు జిన్‌పింగ్‌, మోదీ, పుతిన్‌ సైతం హాజరయ్యే అవకాశం  

చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సెప్టెంబర్ 12 న అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్‌ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా పాల్గొనే అవకాశముంది.  జిన్‌పింగ్‌ 2020 జనవరిలో మయన్మార్‌ పర్యటన తర్వాత కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌ సభ్యదేశాలు. ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది.

Also read: LifeBouy Robot: మునిగిపోతున్న వారిని రోబో రక్షిస్తుంది


UK Parliament: రాణి నిస్వార్థ సేవను కొనసాగిస్తా.. కింగ్‌ చార్లెస్‌–3 తొలి ప్రసంగం

బ్రిటన్‌ రాజు హోదాలో కింగ్‌ ఛార్లెస్‌–3 పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. సెప్టెంబర్ 12 న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్‌ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్‌ పార్లమెంట్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. 

Also read: King Charles III: బ్రిటన్‌ కొత్త రాజుగా చార్లెస్‌ ప్రమాణం


International Dairy Federation World Dairy Summit: లంపీ వ్యాధి వ్యాప్తిని అడ్డుకుంటాం.. ప్రపంచ పాడి సదస్సులో ప్రధాని మోదీ

 

పశుసంపదను బలితీసుకుంటున్న లంపీ చర్మ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ప్రాణాంతక వైరస్‌ కారణంగా ప్రబలే లంపీ వ్యాధి పశువుల్లో తీవ్రమైన జ్వరం, చర్మంపై గడ్డలు ఏర్పడి తుదకు ప్రాణాలను హరిస్తోంది. ఇటీవలికాలంలో ఈ వ్యాధికారణంగా గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాసహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాడి ఆవులు, పశువులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 

Also read: Quiz of The Day (September 13, 2022): ‘సైక్లోన్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?

సెప్టెంబర్ 12 న  గ్రేటర్‌ నోయిడాలో ఇంటర్నేషనల్‌ డైరీ ఫెడరేషన్‌ వరల్డ్‌ డైరీ సమ్మిట్‌ను ప్రారంభించి మోదీ ప్రసంగించారు. ‘ రైతులకు, వారి ఆదాయానికి, పాల ఉత్పత్తికి విఘాతంగా మారిన లంపీ వ్యాధి వ్యాప్తి నిరోధానికి దేశీయంగా వ్యాక్సిన్‌ అందుబాటులోనే ఉంది. మూడేళ్లలో దేశంలోని అన్ని పశువులకు కాళ్లు, నోటి సంబంధ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తాం’ అని మోదీ అన్నారు.

Also read:Quiz of The Day (September 12, 2022): సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?

‘‘పశు ఆధార్‌ పేరిట ప్రతీ పాడిజంతువుకు బయోమెట్రిక్‌ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాడి పరిశ్రమ విస్తరణతోపాటు సంతులిత పాడి ఆర్థికవ్యవస్థ సాధ్యమవుతుంది. గోవర్థన్‌ యోజనతో వ్యవసాయ, డెయిరీ రంగంలో కొత్తగా వేయికిపైగా అంకుల సంస్థలు పురుడుపోసుకున్నాయి. మహిళల భాగస్వామ్యం వల్లే డెయిరీ సెక్టార్‌ వృద్ధిబాటలో పయనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే 44 శాతం వృద్ధితో పాల ఉత్పత్తి నేడు 21 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటు (2 శాతం)తో పోలిస్తే భారత్‌లో పాల ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 6 శాతానికి పెరిగింది. చిన్న రైతుల వల్లే ఇది సాధ్యమైంది’’ అని మోదీ అన్నారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 12th కరెంట్‌ అఫైర్స్‌

Commonwealth Karate Championships: కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం 

 

 కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్‌ రెడ్డి క్యాడెట్‌ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్‌ (సైప్రస్‌) రజతం, హారిసన్‌ లుకాస్‌ (స్కాట్లాండ్‌), జేకబ్‌ కట్లర్‌ (ఇంగ్లండ్‌) కాంస్య పతకాలు గెలిచారు.


Also read: Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్‌’.. ఆరోసారి ఆసియా కప్‌ సొంతం

US Open 2022 Men's Singles: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్న స్పెయిన్‌ టీనేజర్‌ 

 

కార్లోస్‌ అల్‌కరాజ్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల ఈ స్పెయిన్‌ టీనేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించాడు. సెప్టెంబర్ 12న దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 6–4, 2–6, 7–6 (7/1), 6–3తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడంతోపాటు సెప్టెంబర్ 12న విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.

Also read: Iga Swiatek: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచిన మొదటి పోలిష్ టెన్నిస్‌ స్టార్‌

రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ ఐదు స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... 

రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Also read: Asian Junior and Cadet TT Championship:భారత జోడీకి స్వర్ణం

అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో టైటిల్‌ నెగ్గగా... కాస్పర్‌ రూడ్‌కు రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనూ ఓటమి ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ చేతిలో కాస్పర్‌ రూడ్‌ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. నాదల్‌ (19 ఏళ్లు; 2005లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా... సంప్రాస్‌ (19 ఏళ్లు; 1990లో యూఎస్‌ ఓపెన్‌) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు.  


Also read: 2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

  • ఈ ఏడాది అల్‌కరాజ్‌ సాధించిన టైటిల్స్‌ (రియో డి జనీరో, మయామి, బార్సిలోనా, మాడ్రిడ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌).
  • ఈ సంవత్సరం అల్‌కరాజ్‌ మొత్తం 60 మ్యాచ్‌లు 
  • ఆడి 51 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో అతను ఓడిపోయాడు. 
  • కార్లోస్‌ మోయా (1999), కార్లోస్‌ ఫెరీరో (2003), రాఫెల్‌ నాదల్‌ (2008) తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్న నాలుగో స్పెయిన్‌ ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ నిలిచాడు. ప్రస్తుతం అల్‌కరాజ్‌ కోచ్‌ గా ఉన్న ఫెరీరో 2003లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓటమి తర్వాత వరల్డ్‌ నంబర్‌వన్‌ కాగా అల్‌కరాజ్‌ టైటిల్‌ సాధించి టాప్‌ ర్యాంకర్‌ కావడం విశేషం. 
  • టెన్నిస్‌లో ర్యాంకింగ్స్‌ (1973) ప్రవేశపెట్టాక టాప్‌ ర్యాంక్‌ అందుకున్న అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్‌ రికార్డు నెలకొల్పాడు.  

Also read: Italian Grand Prix: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో 11వ విజయం

Soup Fuel: రామెన్‌ సూప్‌తో రైలు పరుగులు!! 

 

ఏ దేశంలోనైనా రైలంటే సాధారణంగా బొగ్గు, ఆవిరి లేదా విద్యుత్‌తో నడుస్తుంది. కానీ జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ ఏకంగా నూడుల్స్‌ సూప్‌తో రైలును పరుగులు పెట్టించి అందరినీ ఆశ్చర్యపరించింది. జపానీయుల ఫేవరేట్‌ వంటకాలైన టొంకుట్సు రామెన్‌ సూప్‌ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలు లేదా మాంసంతో కూడిన డీప్‌ ఫ్రై) వ్యర్థాలను కలిపి తయారు చేసిన బయోఫ్యూయల్‌తో ఈ రైలు నడిచింది. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా బయోడిజిల్‌తో రైలును నడపాలని నిర్ణయించిన టాకచిహో రైల్వే కంపెనీ... 

Also read:  WHO: ఇష్టారాజ్యంగా యాంటీ‘భయో’టిక్స్‌!.. నిజంగా అవసరమైనప్పుడు మందులు పనిచేయవంటున్న అధ్యయనాలు

ఈ బాధ్యతను నిషిడా షౌన్‌ అనే రవాణా కంపెనీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ జపాన్‌ రెస్టారెంట్ల నుంచి రామెన్‌ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను 9:1 నిష్పత్తిలో సేకరించి వాటిని రసాయనాలతో శుద్ధి చేసింది. ఈ కొత్త ఇంధనంతో జూన్‌ నుంచి కొన్ని రైలింజన్లను ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తాజాగా అదే ఇంధనంతో ప్రయాణికుల రైలును టకాచిహో ప్రాంతంలోని మియాజకీ పట్టణంలో నడిపింది. ఈ రైలు ప్లాట్‌ఫారంపై కూతపెడుతుంటే ఆ ప్రాంతమంతా ఫ్రైల సువాసన వ్యాపించిందట. రామెన్‌ సూప్‌తో రైలు నడవడం, ఆ దృశాన్ని తామంతా చూడటం అద్భుతంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. సాధారణ డీజిల్‌ వాడకానికి అయ్యే ఖర్చు తరహాలోనే ఈ కొత్త ఇంధన సేకరణ ఖర్చు ఉందని టాకచిహో రైల్వే కంపెనీ తెలిపింది.

Also read: Foxfire: చీకటి పడితే.. జంగిల్‌ జిగేల్‌

AI: ప్రపంచంలో మొట్టమొదటి రోబో CEOగా టాంగ్‌ యూ

 

చైనాకు చెందిన ఫూజియన్‌ నెట్‌ డ్రాగన్‌ వెబ్‌సాఫ్ట్‌ అనే ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీ కృత్రిమ మేధ (ఏఐ)తో వర్చువల్‌గా పనిచేసే హ్యూమనాయిడ్‌ రోబో ‘మిస్‌ టాంగ్‌ యూ’ని తమ రొటేషనల్‌ సీఈవోగా నియమించింది. ప్రపంచంలో మొట్టమొదటి రోబో సీఈఓగా టాంగ్‌ యూ చరిత్ర సృష్టించింది. 

Also read: Robotics Technologies: ప్రప్రథమ టీచింగ్‌ రోబో ‘ఈగిల్‌’


కంపెనీ సంస్థాగత విషయాలతోపాటు సామర్థ్యం పెంపు వ్యవహారాలను సైతం ఈ రోబో చక్కబెట్టనుంది. దాదాపు రూ. 80 వేల కోట్ల విలువ కలిగిన ఈ కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్‌ యుపై పెట్టింది యాజమాన్యం. పనుల నాణ్యతను పరిశీలించడం, అమలు వేగాన్ని పెంచడం, రోజువారీ కార్యకలాపాల్లో తీసుకునే నిర్ణయాలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో టాంగ్‌ యూ కీలకపాత్ర పోషించనుంది. అలాగే విశ్లేషణ సాధనంగా కూడా పనిచేయనుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, అందరికీ సమన్యాయాన్ని వర్తింపజేయడం వంటి పనులను కూడా చేస్తుందని కంపెనీ చైర్మన్‌ డాక్టర్‌ డేజియన్‌ లియూ తెలిపారు. రాబోయే 30 ఏళ్లలో ఏదో ఓ రోజు బెస్ట్‌ సీఈవోగా ఓ రోబో టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై నిలవడం తథ్యమని అలీబాబా వ్యస్థాపకుడు, చైర్మన్‌ అయిన జాక్‌ మా 2017లో చెప్పాడు. ఇప్పుడు ఓ రోబో సీఈఓగా నియామకం అయ్యింది.  

Also read: MIRI: అరుదైన కార్ట్‌వీల్‌ గెలాక్సీ

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Sep 2022 07:16PM

Photo Stories