Foxfire: చీకటి పడితే.. జంగిల్ జిగేల్
Sakshi Education
ఆకుపచ్చని వెలుగును ‘ఫెయిరీ ఫైర్’,‘ఫాక్స్ ఫైర్’ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు.
‘ఫెయిరీ ఫైర్’ పేరుతో..
భీమశంకర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కనిపించే ఈ ఆకుపచ్చని వెలుగును ‘ఫెయిరీ ఫైర్’,‘ఫాక్స్ ఫైర్’ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు. ఇక్కడ ఉండే ఒక రకమైన ఫంగస్ విడుదల చేసే లూసిఫరేస్ అనే ఎంజైమ్ చెట్ల కాండాలపై ఉండే నీటిని తాకినప్పుడు రసాయనిక చర్యలు జరిగి కాంతి వెలువడుతుంది. ఇలా కాంతిని వెదజల్లగలిగే ఫంగస్‌లు చాలా అరుదు. ఎంతగా అంటే.. సుమారు లక్ష రకాలకు పైగా ఫంగస్‌లు ఉండగా, అందులో కేవలం 70 మాత్రమే ఇలా కాంతిని వెదజల్లగలవు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఉష్ణమండల అరణ్యాల్లో కూడా ఇలా కాంతిని వెదజల్లే ప్రాంతాలు ఉన్నాయి.
Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!
- భీమశంకర్ అడవితోపాటు పశ్చిమ కనుమల వెంట ఉన్న అడవి అంతటా కూడా వెలుగులు విరజిమ్మే ‘మైసెనా క్లోరోఫోస్’ అనే పుట్టగొడుగులు పెరుగుతాయి.
- అయితే వానాకాలంలో,ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ బయో ల్యూమినిసెంట్ ఫంగస్ యాక్టివ్‌గా ఉండి అడవి వెలుగులు విరజిమ్ముతుందని.. సాధారణ సమయాల్లో కనిపించడం చాలా తక్కువ.
కాంతి కోసం.. దారి తప్పకుండా..
- పూర్వకాలంలో స్కాండినేవియాతో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని ఆదివాసీలు ఇలా వెలుగులు విరజిమ్మే చెట్ల కాండాలను తమ దారి వెంట పెట్టుకునేవారని.. అడవుల్లో లోపలికి వెళ్లినప్పుడు దారి తప్పకుండా వినియోగించుకునేవారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
- 18వ శతాబ్దంలో అమెరికా శాస్త్రవేత్త తాను రూపొందించిన జలాంతర్గామిలో కాంతి కోసం ఇలాంటి ఫంగస్ ఉన్న కలపను ఉపయోగించేందుకు ప్రయత్నించారట.
Also read: Smooth Pursuit: గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?
Published date : 02 Sep 2022 04:02PM