Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 12th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 12th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 12th 2022
Current Affairs in Telugu September 12th 2022

King Charles III: బ్రిటన్‌ కొత్త రాజుగా చార్లెస్‌ ప్రమాణం

బ్రిటన్‌ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్‌–3 నియుక్తులయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్‌ కౌన్సిల్‌ సెప్టెంబర్ 10 న ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. 

Also read: Scientist Nayudamma Satjayanti: అసమాన ప్రతిభావంతుడు

ప్యాలెస్‌ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి వినిపించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్‌ సేవ్‌ ద కింగ్‌’ అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్‌–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్‌ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్‌ ట్రూప్స్‌ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. 

Also read: T-Bills: బ్యాంక్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ రాబడి!

రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్‌ బౌల్స్‌ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్‌ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్‌–3 అధినేతగా వ్యవహరిస్తారు. 

నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్‌ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్‌–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. 

Also read: Quiz of The Day (September 10, 2022): గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందెవరు?

బ్రిటన్‌ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌–2 సెప్టెంబర్ 8 న 96వ ఏట కన్నుమూసారు. 

King Charles III: నూతన రాజముద్రిక 

రాజకిరీటం, దానికింద సీఆర్‌ అంటూ పొడి అక్షరాలతో కింగ్‌ చార్లెస్‌–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్‌ అంటే రెక్స్‌ (లాటిన్‌లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్‌ పాలన సాగినంత కాలం బ్రిటన్‌తో పాటు ఇతర కామన్వెల్త్‌ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్‌పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్‌ హయాంలో రాజముద్రికపై ఈఆర్‌ (ఎలిజబెత్‌ రెజీనా) అని ఉండేది.

Also read: Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఇకలేరు... కొన్ని ముఖ్య విషయాలు!

COVID-19 vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!

కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు.  సెప్టెంబర్ 10 న జూమ్‌ యాప్‌ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. 


Also read:First Synthetic Embryo: మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం

ఇందులో భాగంగా డాక్టర్‌ గాయత్రి పండిట్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్‌ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్‌ సిస్టం, ఆస్ట్రేలియన్‌ అడ్వర్స్‌ ఈవెంట్‌ మానిటరింగ్‌ సిస్టం, యూరప్‌లోని యుడ్రా విజిలెన్స్‌ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్‌ డేటాబేస్‌ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్‌ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్‌ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నా­యి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది.  

Also read:Omicron: 'ఒమిక్రాన్‌ 'పై పోరుకు సరికొత్త అస్త్రం

34 దేశాల  ప్రతినిధుల మద్దతు
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్‌ మెడికల్‌ క్రైసెస్‌) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది.

Also read:Covid: కరోనా సోకిన రెండేళ్ల వరకు ఈ సమస్యలు.. : లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

Russia-Ukraine War: రష్యాకు ఎదురుదెబ్బ

 

ఉక్రెయిన్‌తో యుద్ధంతో రష్యాకు తొలిసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తూర్పున ఖర్కీవ్‌ ప్రావిన్స్‌లో ఇజియుం పట్టణంతో పాటు పలుచోట్ల ఉక్రెయిన్‌ దళాల చేతిలో రష్యా సేనలు సెప్టెంబర్ 10 న  ఓటమి చవిచూశాయి. ఉక్రెయిన్‌ సైనికుల కాల్పుల ధాటికి తాళలేక వెనుకంజ వేశాయి. దానికితోడు అన్నివైపుల నుంచీ ఉక్రెయిన్‌ దళాలు చుట్టుముట్టే ప్రమాదముండటంతో తమ సైన్యాన్ని వెనక్కు రావాల్సిందిగా రష్యా ఆదేశించింది. దాంతో భారీ సంఖ్యలో ఆయుధాలు తదితరాలను అక్కడే వదిలి మరీ రష్యా సేనలు వెనుదిరగాల్సి వచ్చింది. ఫిబ్రవరి 24 నుంచి 200 రోజులుగా సాగుతున్న యుద్ధంలో దీన్ని కీలక మలుపుగా భావిస్తున్నారు. 

Also read: US Intelligence Report: రష్యాకు ఉత్తర కొరియా రాకెట్లు

యుద్ధం తొలినాళ్లలో రాజధాని కీవ్‌ను రష్యా భారీ ముట్టడి నుంచి విజయవంతంగా కాపాడుకున్న తర్వాత ఉక్రెయిన్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ పరిణామం పట్ల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘రష్యా సేనలు ఇటీవల తమకు బాగా వచి్చన వెన్నుచూపే విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు. అక్కడ రష్యా సేనలకు సరఫరాలను పూర్తిగా అడ్డుకున్నట్టు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెంజికోవ్‌ ప్రకటించారు. త్వరలో మరిన్ని విజయాలు తథ్యమన్నారు. ఈ ఎదురుదెబ్బతో తల బొప్పి కట్టిన రష్యా పరువు కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. డొనెట్స్‌క్‌ ప్రాంతంలో సైన్యాన్ని బలోపేతం చేయడానికే ఇజియం తదితర చోట్ల నుంచి దళాలను వెనక్కు రప్పించామంటూ రక్షణ శాఖ ప్రకటన చేసింది. కీవ్‌ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగినప్పుడు కూడా రష్యా ఇలాంటి ప్రకటనే చేయడం గమనార్హం. ఈ పరిణామంపై రష్యాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం యుద్ధ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసి తిరిగి పైచేయి సాధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పుతిన్‌ శనివారం మాస్కో పార్కులో ఓ అబ్జర్వేషన్‌ వీల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సజావుగా సాగుతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నాల్లో భాగమేనంటున్నారు.

Also read: Russia President: 'మదర్‌ హీరోయిన్‌'లకు నజరానా

తూర్పుపై సడలిన పట్టు! 
డొనెట్స్‌క్‌ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించడంలో ఇజియుం, పరిసరాల్లో మోహరించిన సేనల పాత్రే కీలకం. అవిప్పుడు అక్కడి నుంచి వెనుదిరగడం డొనెట్స్‌క్‌పై రష్యా పట్టును కూడా బాగా దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. తాజా పరాభవానికి సైనిక నాయకత్వం తప్పిదాలే కారణమంటూ రష్యా అనుకూల చెచెన్యా నాయకుడు రమజాన్‌ కదిరోవ్‌ కూడా దుయ్యబట్టారు. వ్యూహం మార్చుకుని ప్రత్యేక సైనిక చర్య చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటుతుందన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతును కొనసాగించాలని యూరప్‌ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది.

Also read: US President Joe Biden: చారిత్రాత్మక బిల్లుకు బైడెన్‌ ఆమోదం

అణు విద్యుత్కేంద్రం స్వాధీనం 
యుద్ధ తొలినాళ్లలోనే రష్యా ఆక్రమించుకున్న జపోరిజియాలోని కీలక అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంది. యూరప్‌లోనే అతి పెద్దదైన ఈ కేంద్రాన్ని ఆదివారం దేశ విద్యుత్‌ గ్రిడ్‌కు సంధానించింది. అనంతరం రేడియేషన్‌ లీకేజీ ముప్పును నివారించేందుకు అందులో పని చేస్తున్న చివరి రియాక్టర్‌ను కూడా ఇంజనీర్లు విజయవంతంగా నిలిపేశారు. రియాక్టర్లను నిత్యం చల్లగా ఉంచేందుకు ఇకనుంచి ఎమర్జెన్సీ జనరేటర్లను నడపాల్సి ఉంటుంది.

Also read: China - Srilanka: చైనా నిఘా నౌకకు శ్రీలంక పచ్చజెండా

Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు! 

రాష్ట్రంలో అవగాహన లేక చాలామంది కుటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్ల కోసం ముందుకు రావడంలేదు.  ఈ మేరకు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది. కు.ని. ఆపరేషన్లకు అర్హులైనవారిలో 49.2 శాతం మందికే వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని తెలిపింది. గతంలో అది 25 శాతం ఉండేది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 62.8 శాతం మందికి, అత్యంత తక్కువగా జగిత్యాలలో 24 శాతం మందికి అవగాహన కల్పిస్తున్నారు. కు.ని. ఆపరేషన్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిపంచకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు కేవలం 17 శాతమే అవగాహన కల్పిస్తున్నారు. 31.4 శాతంతో మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా అవగాహన కల్పిస్తుండగా, వికారాబాద్, నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 8.6 శాతం ఉందని వివరించింది.  

Also read: Indian Exports: ఆగస్టులో వృద్ధిలేకపోగా 1.15% క్షీణత

నివేదికలోని అంశాలు... 

  • రాష్ట్రంలో 68.1 శాతం మంది కుటుంబ నియంత్రణకు సంబంధించి ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. గతంతో పోలిస్తే 11 శాతం పెరిగింది. అత్యధికంగా 78.7% మంది ఖమ్మం జిల్లాలో, అత్యంత తక్కువగా 49.4% కొమురంభీం జిల్లాలో అనుసరిస్తున్నా రు. ఉత్తర తెలంగాణలో తక్కువగా ఉంది.  
  • అధునాతన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ జరుగుతోంది. 15–49 ఏళ్లలోపు పెళ్లయిన మహిళలు తెలంగాణలో 66.7% అధునాతన పద్ధతులు అవలంభిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యంత ఎక్కువగా 77.9%, అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో 49.1% అవలంభిస్తున్నారు.  
  • ట్యుబెక్టమీ పద్ధతిలో మహిళలు 61.9% మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అంతకుముందుతో పోలిస్తే 7 శాతం పెరిగింది. సూర్యాపేటలో 75.9%, కరీంనగర్‌ జిల్లాలో 44.4% ఉన్నారు.  
  • పురుషుల్లో కుటుంబ నియంత్రణ వెసెక్టమీ అనేది తెలంగాణ సగటు కేవలం రెండు శాతమే. గతం కంటే 0.5% పెరిగింది. జయశంకర్‌ జిల్లాలో అత్యధికంగా అవసరమైనవారిలో 11.3% మంది పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. హైదరాబాద్, జోగులాంబ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్కరూ చేయించుకోలేదు.  
  • గర్భ నియంత్రణ మాత్రల ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేవారు మహిళలు 0.8 శాతమే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు శాతం, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జీరో శాతం ఉంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో 0.5 శాతం పెరిగింది.  
  •  మహిళలకు గర్భాశయంలో ఒక డివైజ్‌ (ఐయూడీ)ను ప్రవేశపెట్టడం ద్వారా కుటుంబ నియంత్రణ పాటించే పద్ధతి రాష్ట్రంలో 0.5 % గా ఉంది. హైదరాబాద్‌లో 1.8 శాతం మంది ఉపయోగిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో ఈ పద్ధతిని పాటించడంలేదు.  
  •  కండోమ్స్‌ను వినియోగించే పురుషులు 0.8 శాతమే. గతంతో పోలిస్తే 0.3% పెరిగింది. సిరిసిల్ల జిల్లాలో 1.8% మంది ఉపయోగిస్తున్నారు. మంచిర్యాలలో జీరో శాతం ఉన్నారు.  
  •  ఇంజెక్షన్‌ రూపంలో రాష్ట్రంలో మహిళలు కుటుంబ నియంత్రణ పాటించేవారు 0.1% మాత్రమే ఉన్నారు.  
  • అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే అవకాశం ఉన్నా చేయించుకోనివారు రాష్ట్రంలో 6.4% ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 13.4% కాగా, నల్లగొండ జిల్లాలో రెండు శాతం ఉన్నారు.   

Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

Italian Grand Prix: వెర్‌స్టాపెన్‌ ఖాతాలో 11వ విజయం 

 రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో 11వ విజయాన్ని సాధించాడు. సెప్టెంబర్ 11 నజరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచి వరుసగా ఐదో విజయం నమోదు చేశాడు. 12వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన వెర్‌స్టాపెన్‌ అదే జోరులో నిర్ణిత 53 ల్యాప్‌ల రేసును గంటా 20 నిమిషాల 27.511 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం వెర్‌స్టాపెన్‌ 335 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లెక్‌లెర్క్‌ 219 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

Also read: Virat Kohli: మెరుపు శతకంతో చెలరేగిన కోహ్లి


Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్‌’.. ఆరోసారి ఆసియా కప్‌ సొంతం

 

ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ప్రదర్శనతో విజేతగా నిలిచింది. తొలి లీగ్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడటంతో అందరూ తక్కువగా అంచనా వేసినా ‘అధికారిక ఆతిథ్య జట్టు’... ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి ఆరోసారి ఆసియా కప్‌ను సగర్వంగా అందుకుంది. సెప్టెంబర్ 11 న జరిగిన ఫైనల్లో లంక 23 పరుగులతో పాకిస్తాన్‌పై నెగ్గింది. 

Also read: BWF Singles Women Rankings: జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా అనుపమ

గతంలో శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014లలో ఆసియా కప్‌ టైటిల్‌ను సాధించింది. శ్రీలంక గత ఐదు టైటిల్స్‌ వన్డే ఫార్మాట్‌లో రాగా... టి20 ఫార్మాట్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 

Also read: Ultimate Kho Kho: ఖో–ఖో లీగ్‌ విజేత ఒడిశా జగర్‌నాట్స్‌


Australia-Newzealand Series: ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌.. Australia captain Aaron Finch వన్డే కెరీర్‌కు వీడ్కోలు

 

ఆ్రస్టేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ తన వన్డే కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. అతని నాయకత్వంలోని ఆసీస్‌ 3–0 తేడాతో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.  సెప్టెంబర్ 11 న  జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 

Also read: Antim Panghal: అండర్‌ 20 ప్రపంచ రెజ్లింగ్‌లో అంతిమ్‌కు స్వర్ణం

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. 


Iga Swiatek: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచిన మొదటి పోలిష్ టెన్నిస్‌ స్టార్‌

 

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను తొలిసారి దక్కించుకుంది.   సెప్టెంబర్ 10న అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ 6–2, 7–6 (7/5)తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... రన్నరప్‌ ఆన్స్‌ జబర్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

Also read: Caroline Garcia: సిన్సినాటి టైటిల్‌ గార్సియా సొంతం
 
ఈ ఏడాది స్వియాటెక్‌ నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ (దోహా, ఇండియన్‌ వెల్స్, మయామి, స్టుట్‌గార్ట్, రోమ్, ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌). 2014లో సెరెనా ఒకే ఏడాది ఏడు అంతకంటే ఎక్కువ టైటిల్స్‌ నెగ్గింది.  

స్వియాటెక్‌ కెరీర్‌లో సాధించిన సింగిల్స్‌ టైటిల్స్‌. ఈ పది ఫైనల్స్‌లో స్వియాటెక్‌ వరుస సెట్‌లలో గెలుపొందడం విశేషం.  

Also read: 2022 Formula 1 Season : ఫార్ములావన్‌–2022 సీజన్‌లో..వెర్‌స్టాపెన్‌ ఖాతాలో మ‌రో విజయం

ఒకే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన పదో ప్లేయర్‌గా స్వియాటెక్‌ నిలిచింది. గతంలో మార్గరెట్‌ కోర్ట్, బిల్లీజీన్‌ కింగ్, క్రిస్‌ ఎవర్ట్, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీ గ్రాఫ్, మోనిక సెలెస్, అరంటా శాంచెజ్, సెరెనా విలియమ్స్,  హెనిన్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.  

Also read: World cadet judo championships 2022: ప్రపంచ చాంపియన్‌ లింథోయ్‌

స్వియాటెక్‌   ఆన్స్‌ జబర్‌
1 ఏస్‌లు 0
2 డబుల్‌ ఫాల్ట్‌లు 4
11/16 నెట్‌ పాయింట్లు 7/15
5/12 బ్రేక్‌ పాయింట్లు 3/9
19 విన్నర్స్‌ 14
30 అనవసర తప్పిదాలు 33
81 మొత్తం పాయింట్లు 66

Also read: World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో..


LifeBouy Robot: మునిగిపోతున్న వారిని రోబో రక్షిస్తుంది

సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్‌ సేఫ్‌ సంస్థ ‘లైఫ్‌ బాయ్‌’ పేరుతో ఈ రోబోను రూపొందించింది.  

ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు.  

Also read: Special Algorithm: హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:46PM

Photo Stories