Skip to main content

Scientist Nayudamma Satjayanti: అసమాన ప్రతిభావంతుడు

భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించిన వారు డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు.
Dr. Yelavarthy Nayudamma JAYANTHI
Dr. Yelavarthy Nayudamma JAYANTHI

భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూ ట్‌లో చేరి చివరకు దాని డైరెక్టర్‌ అయ్యారు.
నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీహైడ్స్‌ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జా తీయ గుర్తింపు పొందారు.

Also read: Babu Bindheshwari Prasad Mandal: మండల్‌ దన్నుతో ఉద్యమించాలి!

నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశా లకు మధ్య స్నేహ వారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యా ధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్‌ ప్లాంట్‌లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహద పడ్డారు. ‘లెదర్‌ సైన్స్‌’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు.

Also read: జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్‌–ఛాన్స్‌లర్‌గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు.

Also read: 2020లో ప్రపంచాన్ని నడిపించిన గొప్ప స్త్రీ మూర్తులు

– డాక్టర్‌ తన్నీరు కళ్యాణ్‌ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి
(శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి)

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:03PM

Photo Stories