Skip to main content

Babu Bindheshwari Prasad Mandal: మండల్‌ దన్నుతో ఉద్యమించాలి!

ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)...
మండల్‌ వ్యతిరేక ఉద్యమం (ఇన్‌సెట్‌లో బీపీ మండల్‌)
మండల్‌ వ్యతిరేక ఉద్యమం (ఇన్‌సెట్‌లో బీపీ మండల్‌)

తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతు లను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియ మించింది. 1955 మార్చిలో కమిషన్‌ నివేదిక సమ ర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 

Also read: యుఎన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే, యుఎన్ స్పానిష్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

1977లో జనతా పార్టీ  అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్‌ కమిషన్‌ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెం బర్‌లో నియమించింది. దీనికి బిహార్‌ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్‌ సారధ్యం వహించారు. మండల్‌ 1980 డిసెంబర్‌ 31న నివేదికను ప్రభుత్వానికి సమ ర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచు కోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ 1990 ఆగస్టు 7న మండల్‌ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్‌ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహ రించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. 

Also read: టిప్పన్‌ నక్ష అంటే ఏమిటి?

మండల్‌ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధి పత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్‌ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్‌ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్‌ బ్యాక్‌వార్డ్‌ క్లాసెస్‌’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్‌ కమిషన్‌ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 

Also read: 2020లో ప్రపంచాన్ని నడిపించిన గొప్ప స్త్రీ మూర్తులు

బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్‌ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్‌  మధేపూర్‌ జిల్లా మోరో గ్రామంలో... రాస్‌ బీహారీ లాల్‌ మండల్‌ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్‌ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్‌ మనోహర్‌ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్‌ 1967 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపిం చారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరి గితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా  కాంగ్రెస్‌ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహ రించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్‌. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నాయకత్వంలో అవి నీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలి పోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘా లకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్‌ కమిషన్‌ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించు కోవాలి. 

Also read: లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక

సాయిని నరేందర్‌ 
వ్యాసకర్త బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 25 Aug 2022 05:58PM

Photo Stories