Skip to main content

World Suicide Prevention Day: దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. మరణమే శరణ్యమా..? కానే కాదు..

సమస్య ఏదైనా ఆత్మహత్యే శరణ్యమనుకొనే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది కేవలం ఆత్మహత్యల ద్వారానే మృతిచెందారు.
World Suicide Prevention Day
World Suicide Prevention Day

చాలా మంది చిన్న చిన్న కారణాలతోనే మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తేలింది. చిన్న వయసులోనే మానసిక రుగ్మతలు, కుటుంబ కలహాలతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి మృతులను కౌన్సెలింగ్‌ ద్వారా నియంత్రించే అవకాశమున్నా.. అవి కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read: సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

ఏపీలో తక్కువగా..
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో బలవన్మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 7,043 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కువ ఆత్మహత్యలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 19,909 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులో 16,883 మంది, మధ్యప్రదేశ్‌లో 14,578 మంది, పశ్చిమ బెంగాల్‌లో 13,103 మంది, కర్ణాటకలో 12,259 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.8 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి.

Also read: World Maritime Day: అంతర్జాతీయ సముద్ర దినోత్సవం

కుటుంబ కలహాలతోనే ఎక్కువగా..
కుటుంబాల్లో చిన్న చిన్న కలహాలే అధిక శాతం ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ కలహాలతోనే 33.6 శాతం మంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది యువతీ యువకులు కుటుంబంలో గొడవలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.  ప్రేమలో విఫలమవడం వంటివీ ఎక్కువయ్యాయి. ఒంటరితనం, సామాజిక, లైంగిక వేధింపులు, హింసకు గురవడం, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక శారీరక సమస్యలు వంటివి కూడా ఆత్మహత్య వైపు పురిగొల్పుతున్నాయి. చెడువ్యవసనాలతో మానసిక కుంగుబాటుకు గురై మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఉరేసుకోవడం, పురుగుల మందు తాగడం, నీటిలో దూకడం, ఒంటికి నిప్పు పెట్టుకోవడం వంటి మార్గాల ద్వారా ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

Also read: Anti Terrorism Day: జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

కౌన్సెలింగ్‌ మేలు
సమస్యల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మానసిక వేదనతో బాధ పడుతున్న వారిని సన్నిహితులు, స్నేహితులు గుర్తించాలి. వారిని వేధిస్తున్న సమస్య నుంచి బయటపడేసే మార్గాలు చూడాలి. వారిలో మనోధైర్యం కల్పించాలి. ఇంకా అవసరమైతే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. వారి సమస్యకు పరిష్కారాలున్నాయని, మరణమే శరణ్యం కాదని విశదీకరించి చెప్పాలి. అప్పుడే వారు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన నుంచి బయటకొచ్చి మామూలు మనుషులుగా మారతారని నిపుణులు చెబుతున్నారు.

Also read: International Day of Families: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

ఆత్మహత్యలు ఇలా..
కారణం    శాతం
కుటుంబ సమస్యలు    33.6
మానసిక, శారీరక సమస్యలు    18
చెడు వ్యసనాలు    6
వైవాహిక సమస్యలు    5
ప్రేమలో వైఫల్యం    4.4
ఆర్థిక సమస్యలు    3.4
నిరుద్యోగం    2.3
పరీక్షలు తప్పడం    1.4
పేదరికం    1.2

Also read: International Museum Day: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఏప్పుడు జ‌రుపుకుంటారు?

ప్రధాన రాష్ట్రాల్లో ఆత్మహత్యల శాతం
మహారాష్ట్ర    13
తమిళనాడు    11
మధ్యప్రదేశ్‌    9.5
పశ్చిమబెంగాల్‌    8.6
కర్ణాటక    8.0
కేరళ    5.6
గుజరాత్‌    5.3
తెలంగాణ    5.3
ఛత్తీస్‌గఢ్‌‡    5.0
ఆంధ్రప్రదేశ్‌    4.6
ఒడిశా    3.6
ఉత్తరప్రదేశ్‌    3.1

Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Sep 2022 05:49PM

Photo Stories