World Maritime Day: అంతర్జాతీయ సముద్ర దినోత్సవం
Sakshi Education
World Maritime Day: అంతర్జాతీయ సముద్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తున్నారు?
అంతర్జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి ఏటా జూన్ 8న నిర్వహిస్తున్నారు. సముద్రాల పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించింది. 2004లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008 జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించింది.అప్పటినుంచి సముద్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. ప్రతి మనిషి సాగరశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుని.. సముద్రాలను కాపాడుకునే దిశగా అడుగులు వేయాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
Published date : 11 Dec 2024 06:33PM