International Museum Day: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఏప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు.
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
మ్యూజియంల గురించి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశ్యం. మ్యూజియంలు మన గతం గురించి తెలుపుతాయి. ఈ రోజున భారతదేశంలోని అనేక మ్యూజియంలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కృతుల, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం, శాంతిని పెంపొందించడానికి వాటి గురించి అవగాహన కలిపించడానికే మ్యూజియంలు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐకామ్) సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం 1977లో ఈ నిర్ణయం తీసుకున్నారు.