Skip to main content

China - Srilanka: చైనా నిఘా నౌకకు శ్రీలంక పచ్చజెండా

China - Srilanka

భారత్‌ తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నప్పటికీ.. చైనా నిఘా నౌక 'యువాన్‌ వాంగ్‌ 5'కు అనుమతిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బాలిస్టిక్‌ క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలపై నిఘా వేయగలిగే అధునాతన సాంకేతిక హంగులున్న ఈ నౌకను హంబన్‌ టొటా పోర్టులో నిలిపేందుకు అనుమతించింది. 
శ్రీలంకలో చైనా నౌకతో భారత్‌ ఆందోళనకు గల 5 కారణాలు

  1. చైనా యాంగ్‌వాంగ్‌ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ట్రాక్‌చేయగలదు. ఈ క్షిపణులను భారత్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‌ నుంచి ప్రయోగిస్తుంటుంది.
  2. యాంగ్‌వాంగ్‌5 లోని అత్యాధునిక సాంకేతిక భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలుగుతుంది. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్‌ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది.
  3. యాంగ్‌వాంగ్‌5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్‌ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్‌యాంగ్‌ హంగ్‌ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది.
  4. 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈసారి చైనా నౌక ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ ఆన్‌ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌ టొటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ.. ఆపరేషనల్‌ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్‌ అథారిటీ తెలిపింది.
  5. చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌ టొటా నౌకాశ్రయాన్ని 99ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును చైనా తన మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్‌.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (International) Bitbank: 2022 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 04:45PM

Photo Stories