Russia President: 'మదర్ హీరోయిన్'లకు నజరానా
Sakshi Education
జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్‌కాలం నాటి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే మహిళలకు నజరానా ప్రకటించారు. ఇలాంటి వారిని 'మదర్ హీరోయిన్'గా గుర్తించి.. 10 లక్షల రూబుళ్లను(భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) పురస్కారంగా ఇస్తారని 'వాషింగ్టన్ పోస్ట్' కథనం వెల్లడించింది. ఈ మొత్తాన్ని 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజున చెల్లిస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Sep 2022 04:52PM