Robotics Technologies: ప్రప్రథమ టీచింగ్ రోబో ‘ఈగిల్’
‘ఈగిల్’ ప్రత్యేకతలివే...
లాంగ్వేజెస్‌తోపాటుగా సైన్స్, హ్యుమానిటీస్, తదితర సబ్జెక్టులను బోధించడానికి ‘ఈగిల్’ రోబోలు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఇది భావ వ్యక్తీక రణతో పాటు, ముఖాముఖిగానూ చురుకుగా ఉంటుంది. తరగతి గదిలో ఎవరిపైనా ఆధారపడకుండా గ్రేడ్ 5 నుంచి 11వ తరగతి విద్యార్థులకు బోధించగలదు. 30కిపైగా విభిన్నమైన భాషలలో విద్యను అందిస్తాయి. విద్యార్థుల సందేహాలను నివృత్తి కూడా చేస్తాయి. అనలటిక్స్ సహాయంతో తరగతి చివరి దశలో రివిజన్స్ నిర్వహించగలవు. తమ మొబైల్, ట్యాబ్ లేదా ల్యాప్ టాప్‌లతో రోబో కంటెంట్‌తో విద్యార్థులు అనుసంధానం కావచ్చు. రోబో ప్యాకేజీ ప్రీలోడెడ్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. దీన్ని వివిధ భాషల్లో విభిన్న పాఠ్యాంశాల కోసం రూపొందించుకోవచ్చు. టీచర్ ట్రైనింగ్ ప్యాకేజీ ద్వారా రోబోల వినియోగం గురించి ఉపాధ్యాయులకు శిక్షణనూ ఇస్తుంది.
Also read: కార్డులెస్ ఫోన్ ఎలా పనిచేస్తుంది?