Skip to main content

King Charles III: బ్రిటన్‌ కొత్త రాజుగా చార్లెస్‌ ప్రమాణం

బ్రిటన్‌ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్‌–3 నియుక్తులయ్యారు.
రాజుగా ప్రమాణం చేస్తున్న చార్లెస్‌. పక్కన భార్య కెమెల్లా
రాజుగా ప్రమాణం చేస్తున్న చార్లెస్‌. పక్కన భార్య కెమెల్లా

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్‌ కౌన్సిల్‌ సెప్టెంబర్ 10 న ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. 

Also read: Scientist Nayudamma Satjayanti: అసమాన ప్రతిభావంతుడు

ప్యాలెస్‌ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి వినిపించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్‌ సేవ్‌ ద కింగ్‌’ అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్‌–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్‌ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్‌ ట్రూప్స్‌ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. 

Also read: T-Bills: బ్యాంక్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ రాబడి!

రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్‌ బౌల్స్‌ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్‌ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్‌–3 అధినేతగా వ్యవహరిస్తారు. 

నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్‌ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్‌–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. 

Also read: Quiz of The Day (September 10, 2022): గోహత్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందెవరు?

బ్రిటన్‌ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌–2 సెప్టెంబర్ 8 న 96వ ఏట కన్నుమూసారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Sep 2022 06:07PM

Photo Stories