SCO Summit: ఎస్సీఓ సదస్సుకు జిన్‌పింగ్, మోదీ, పుతిన్ సైతం హాజరయ్యే అవకాశం
Sakshi Education
చైనా అధినేత షీ జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు.
సెప్టెంబర్ 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సెప్టెంబర్ 12 న అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. జిన్‌పింగ్ 2020 జనవరిలో మయన్మార్ పర్యటన తర్వాత కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ సభ్యదేశాలు. ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది.
Also read: LifeBouy Robot: మునిగిపోతున్న వారిని రోబో రక్షిస్తుంది
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 13 Sep 2022 06:43PM