Skip to main content

SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు

- ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం
New era in the state's industrial sector
New era in the state's industrial sector

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సెప్టెంబర్ 5 న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ఉపాధి లభించనుంది.

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 3rd కరెంట్‌ అఫైర్స్‌

ఇందులో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్‌ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్‌ ఎనర్జీ పాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌.. రోల్డ్‌ గ్లాసెస్‌ తయారీ యూనిట్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్‌ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్‌ ఫార్మా, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్‌ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.   

Also read: Quiz of The Day (September 03, 2022): తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Sep 2022 04:26PM

Photo Stories