Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 15th కరెంట్ అఫైర్స్
Henley & Partners Group Report: న్యూయార్క్, టోక్యో... కుబేరుల అడ్డాలు.. ప్రపంచంలో 25వ స్థానంలో ముంబై
ప్రపంచంలో అపర కుబేరులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ధనవంతులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికాలోనే ఉండడం విశేషం. ఒక మిలియన్ డాలర్లు (రూ.7.94 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంటే మిలియనీర్లుగా పరిగణిస్తారు.
Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు
- 2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోయింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు. లండన్‌లో 9 శాతం తగ్గిపోయారు.
- సౌదీ అరేబియా రాజధాని రియాద్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో సంపన్నుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
- అబూ దాబీ, దుబాయ్ సిటీలు బడా బాబులను ఆకర్శిస్తున్నాయి. ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఉండడమే ఇందుకు కారణం.
- రష్యా ధనవంతులు యూఏఈకి వస్తున్నారు.
- సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై సిటీలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లోని ముంబై నగరం 25వ స్థానంలో నిలిచింది.
- ఈ ఏడాది సంపద తరలిపోతున్న దేశాల్లో రష్యా తర్వాత రెండో స్థానం చైనాదేనని ‘హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ గ్రూప్’ అంచనా వేసింది.
Also read: Asia's Richest Woman: ఆసియా సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
2022 World Wrestling Championships: రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు
బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 28 ఏళ్ల వినేశ్ రికార్డు నెలకొల్పింది.
Also read: Neeraj Chopra: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం
2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ వినేశ్ కాంస్య పతకం సాధించింది. సెప్టెంబర్ 14న జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్‌లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్‌గ్రెన్ (స్వీడన్)పై గెలిచింది.
Also read: Quiz of The Day (September 15, 2022): ఏ చెట్టును ‘ప్రాక్ దేశపు రాజ్య వృక్షం’ అని పిలుస్తారు?
కాంస్యం రేసులో నిషా
మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్‌లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్‌లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 14th కరెంట్ అఫైర్స్
2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరిత మోర్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–7తో లిసాక్ అన్‌హెలినా (పోలాండ్) చేతిలో... మాన్సి అహ్లావత్ క్వార్టర్ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్) చేతిలో... రితిక తొలి రౌండ్‌లో 2–6తో కెండ్రా అగస్టీన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు.
BCCI అధ్యక్ష, కార్యదర్శులు ఆరేళ్లపాటు పని చేయవచ్చు: సుప్రీం కోర్టు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక పరిణామం. నియమావళిలో మార్పులకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించిన బోర్డుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇకపై బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో కలిపి వరుసగా 12 ఏళ్లు పదవిలో ఉండే అవకాశంతో పాటు ఆ తర్వాతే మూడేళ్లు విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) ఇచ్చే విధంగా నిబంధనను మార్చుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడా బెంచ్ సెప్టెంబర్ 15న దీనిపై స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా రాష్ట్ర క్రికెట్ సంఘంలో లేదా బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవీకాలం ముగిసిన తర్వాత కనీసం మూడేళ్లు విరామం ఇచ్చిన తర్వాతే మళ్లీ ఏదైనా పదవి కోసం పోటీ పడవచ్చు.
Also read: CMIE Reports: నిరుద్యోగం పైపైకి.. యువత, మహిళలపై తీవ్ర ప్రభావం
అయితే ఇప్పుడు సుప్రీం అనుమతించిన దాని ప్రకారం బీసీసీఐలో ఆరేళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘంలో ఆరేళ్ల పదవిని వేర్వేరుగా చూడనున్నారు. అంటే రాష్ట్ర సంఘంలో పని చేసిన తర్వాత కూడా బీసీసీఐలో వరుసగా మూడేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలు (మొత్తం ఆరేళ్లు) పదవి చేపట్టే అవకాశం ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకారం అందరికంటే ఎక్కువ ప్రయోజనం బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షాలకు లభించనుంది. వీరిద్దరు 2019లో పదవిలోకి వచ్చారు. గత నిబంధనల ప్రకారం వారిద్దరి పదవీ కాలం ఇటీవలే ముగిసింది. అయితే పదే పదే వ్యక్తులు మారకుండా అనుభవజు్ఞలు ఎక్కువ కాలం బోర్డులో ఉంటే ఆటకు మేలు జరుగుతుందనే వాదనతో సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. ఈ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో గంగూలీ, జై షా మరోసారి ఎన్నికై 2025 వరకు తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం ఉత్తర్వుల కోసం వేచి చూస్తూ ఈ నెల చివర్లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసిన బీసీసీఐ త్వరలోనే ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైంది.
ICC Rankings: కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు
ఆసియా కప్ టి20 టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 276 పరుగులు సాధించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. సెప్టెంబర్ 15న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Also read: Commonwealth Karate Championships: కార్తీక్ రెడ్డికి స్వర్ణం
భారత్‌కే చెందిన సూర్యకుమార్ యాదవ్ నాలుగో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
WPI: టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’ ఆగస్టులో 12.41 శాతం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి. గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే..
Also read: Indian Exports: ఆగస్టులో వృద్ధిలేకపోగా 1.15% క్షీణత
- ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి. టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది.
- ఇంధనం, విద్యుత్ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం.
- తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది.
- ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది.
17 నెలలుగా ఇలా...
నెల | టోకు ద్రవ్యోల్బణం(%ల్లో) |
2021 ఏప్రిల్ | 10.74 |
మే | 13.11 |
జూన్ | 12.07 |
జూలై | 11.16 |
ఆగస్టు | 11.39 |
సెప్టెంబర్ | 10.66 |
అక్టోబర్ | 12.54 |
నవంబర్ | 14.87 |
డిసెంబర్ | 13.56 |
2022 జనవరి | 12.96 |
ఫిబ్రవరి | 13.11 |
మార్చి | 14.55 |
ఏప్రిల్ | 15.08 |
మే | 15.88 |
జూన్ | 15.18 |
జూలై | 13.93 |
Also read: Fifth Strongest Economy: ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
India's Exports: ఆగస్టులో ఎగుమతులు.. ‘ప్లస్సే’
భారత్ ఎగుమతులు ఆగస్టులో వృద్ధినే నమోదుచేసినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ సెప్టెంబర్ 15న వెలువరించిన సవరిత గణాంకాలు స్పష్టం చేశాయి. సమీక్షా నెల ఎగుమతుల్లో 1.62 శాతం వృద్ధి నమోదయిందని, విలువలో ఇది 33.92 డాలర్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, నెలవారీగా తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత అవి వృద్ధిబాటలోకి రావడం ఇది వరుసగా రెండవనెల. జూలైలో తొలి గణాంకాలు క్షీణత (–0.76) నుంచి 2 శాతం వృద్ధికి మారాయి. ఆగస్టు విషయంలో తొలి గణాంకాల క్షీణ అంచనా మైనస్ 1.15 శాతం.
Also read: India Exports - Imports : జూలై గణాంకాలు నిరాశాజనకం
Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు
జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం.
Also read: Facebook: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఫేస్‌బుక్
పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది
ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి.
Also read: Skilling Programme: సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్న సంస్థ?
- ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది.
- అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా.
- ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం.
Also read: Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!
సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్
సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు.
Also read: International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
- యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా.
- ఇక ఉక్రెయిన్‌లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ.
Also read: World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్రతి వెయ్యి పుట్టుకల్లో ఏ దేశంలో ఎన్ని?
దేశం | ఖండం | జననాలు |
భారత్ | ఆసియా | 171.62 |
చైనా | ఆసియా | 102.84 |
నైజీరియా | ఆఫ్రికా | 56.50 |
పాకిస్తాన్ | ఆసియా | 47.23 |
కాంగో | ఆఫ్రికా | 31.90 |
ఇండోనేషియా | ఆసియా | 31.20 |
యూఎస్‌ఏ | అమెరికా | 30.42 |
ఇథియోపియా | ఆఫ్రికా | 25.44 |
బ్రెజిల్ | అమెరికా | 22.27 |
బంగ్లాదేశ్ | ఆసియా | 21.52 |
Also read: Telangana Formation Day: ఈ దినం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా తలెత్తుకునే రోజు.. ఎందుకంటే..?
2050 నాటికి ప్రమాదకర స్థాయిలో జనాభా తగ్గనున్న దేశాలు..
దేశం | తగ్గుదల శాతం |
బల్గేరియా | 22.5 |
లిథుయేనియా | 22.1 |
లాట్వియా | 21.6 |
ఉక్రెయిన్ | 19.5 |
సెర్బియా | 18.9 |
బోస్నియా | 18.2 |
క్రొయేషియా | 18.0 |
మల్డొవా | 16.7 |
జపాన్ | 16.3 |
అల్బేనియా | 15.8 |
రొమేనియా | 15.5 |
గ్రీస్ | 13.4 |
ఎస్తోనియా | 12.7 |
హంగరీ | 12.6 |
పోలండ్ | 12.0 |
జార్జియా | 11.8 |
పోర్చుగల్ | 10.9 |
మెసడోనియా | 10.9 |
క్యూబా | 10.3 |
ఇటలీ | 10.1 |
Also read: World Suicide Prevention Day: దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. మరణమే శరణ్యమా..? కానే కాదు..
మన దేశానికి ప్రయోజనాలెన్నో..
మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం..
- 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది.
- 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా.
- గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది.
- వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు.
- ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా.
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి)
Also read: International Day of Families: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏప్పుడు జరుపుకుంటారు?
Facebook: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఫేస్‌బుక్
సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మొదటి ప్లేస్‌లో ఫేస్‌బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు.. వంటివెన్నో ఉంటున్నాయి.
Also read: Cyber Crime Investigation and Intelligence Summit 2022.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్. ఫొటోలు, వీడియోలు అనేక ఇతర ఇంటరాక్టివ్ అంశాలు, వ్యాపారం, సేవలను ప్రోత్సహించడానికి మాధ్యమంగా ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. నెట్‌వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయి ఉండటంతో, స్కామర్లకు ఇది ఒక మాధ్యమంగా మారింది. దీంతో మోసగాళ్లు సోషల్ మీడియా హ్యాండిల్ నుండి లింక్‌లు, కనెక్షన్ లతో స్కామ్‌లకు తెరలేపుతున్నారు.
Also read: Online Safety: ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎంత భద్రం?
స్కామ్‌లు... ఫేస్‌బుక్ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్ వంటి ఈ మోసాల జాబితాలో మొదట బాధితుడి ప్రొఫైల్‌ను హైజాక్ చేసి, ఆపై వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయ్యిందని తెలియదు. దీంతో ఫేస్‌బుక్ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్‌బుక్ చీటింగ్ స్కామ్‌కు సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు.
Also read: Cyber Security: మహిళలే లక్ష్యం... సైబర్ సేఫ్టీ పాయింట్స్ ఇవే
యాక్సెస్ సులువు... సైబర్ నేరగాళ్లు బాధితురాలి/బాధితుడి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత వివరాలన్నింటికి యాక్సెస్ పొందుతారు. స్కామర్ బాధితుడి ఫేస్‌బుక్ ఖాతాను లక్ష్యంగా చేసుకుని హ్యాక్ చేస్తాడు. తర్వాత స్నేహితుల జాబితాలోని వారిని సంప్రదిస్తాడు.
Also read: Aadhar biometric locking: నకిలీలలు - ముద్ర కాని ముద్ర
∙స్కామర్ సాధారణంగా డబ్బు అడగడానికి ప్రయత్నిస్తాడు ∙నిధుల బదిలీ, యాక్సెస్ కోడ్, వ్యక్తిగత మొబైల్ నంబర్లు, ఇతర వివరాల కోసం ఒక స్కామర్ ద్వారా ఫేస్‌బుక్ ప్రొఫైల్ యజమాని స్నేహితులు సంప్రదించినట్లు అనేక కేసులు ఇప్పటికే సైబర్‌క్రైమ్‌లో ఫైల్ అయి ఉన్నాయి. వీటిలో...
Also read: Job Skills: టెక్ నైపుణ్యాలతో టాప్ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు..
శృంగారపరమైన మోసాలు... అంత్యంత పెద్ద స్కామ్‌లలో ఇది ఒకటి. ఫేస్‌బుక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రేమికులుగా నటిస్తారు. స్కామర్లు వారి బాధాకరమైన జీవనం గురించి, భాగస్వామి నుంచి విడిపోయినట్లు నటిస్తారు లేదా మిమ్మల్ని ఆకర్షించడానికి ముఖస్తుతిని ఉపయోగిస్తారు. ఒక శృంగారపరమైన వీడియో సంభాషణ మీ భావోద్వేగాలతో ఆడుకోవడానికి, మీ నమ్మకాన్ని పొందేందుకు రూపొందించి ఉంటుంది. వారాలు, నెలల వ్యవధిలో మెసెంజర్‌చాట్‌లను పెంచుతూ ఉంటారు. చివరికి ఏదో సమస్య చెప్పి డబ్బు పంపమని అడుగుతారు. ఆన్ లైన్ లో క్యాట్‌ఫిషింగ్ కోసం ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలలో ఒకటి.
Also read: Internet Fraud Awareness: అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?!
షాపింగ్ మోసాలు... ఫేస్‌బుక్ ద్వారా స్కామర్లు నకిలీ వస్తువులను అంటగట్టడానికి నకిలీ బ్రాండ్ ఖాతాలను సృష్టిస్తారు. రకరకాల ఆఫర్లతో ఎన్నడూ వినని షాప్ పేర్లను సృష్టిస్తారు. ప్రకటనలను పుష్ చేస్తారు. చౌక ధరలకు వస్తువులను అందిస్తామంటారు కానీ దేనినీ పంపరు. బదులుగా, మీ డబ్బు తీసుకొని అదృశ్యమవుతారు.
Also read: Fake Website: ఫేక్ వెబ్‌సైట్‌తో ఫీజు వసూలు
నకిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు... ఫేస్‌బుక్‌లో ఉన్న ఎవరైనా ఈ స్కామ్‌ను ఎదుర్కొనే ఉంటారు. ఒక వ్యక్తిని ఫాలో అవడానికి మొత్తం ఫేస్‌బుక్ ఖాతాలను చేరుకోవడానికి స్కామర్‌లకు ఇది ఇష్టమైన వ్యూహం. మీరు ఒక ఫేక్ అభ్యర్థనను అంగీకరించినప్పుడు, మీరు మీ అకౌంట్ లాక్ చేసినా మీరు స్కామర్‌కి అంతర్గత యాక్సెస్‌ను అందించినట్టే. మీ డిజిటిల్ డివైజ్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే మోసపూరితమైన లింక్ వంటి ఇతర స్కామ్‌ల బారినపడేలా మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు.
నకిలీ ఛారిటీ స్కామ్‌లు... విపత్తు సంభవించినప్పుడు, సహాయం చేయాలనుకోవడం మానవ స్వభావం. చాలా మందికి, దీని అర్థం డబ్బును విరాళంగా ఇవ్వడం. మోసగాళ్లకు ఇది తెలుసు. వెంటనే డబ్బు చెల్లించేలా సంక్షోభాలను ఉపయోగిస్తారు. నకిలీ ఛారిటీ పేజీలు, వెబ్‌సైట్‌లు, గో ఫండ్ మి వంటి ప్రసిద్ధ సైట్‌లలో ఖాతాలను కూడా సృష్టించి, ఆపై మీ ఫేస్‌బుక్ ఫీడ్‌లో వారి ‘ధార్మిక సంస్థలను’ ప్రచారం చేస్తారు. ఫోన్ యాప్‌ల ద్వారా డబ్బు చెల్లించమని అడుగుతారు.
మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఇచ్చే ముందు రీసెర్చ్ చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఛారిటీ నావిగేటర్, గైడ్‌స్టార్, ఛారిటీ వాచ్‌తో సహా ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సైట్‌లను చెక్ చేయండి.
Also read: Internet: మెరుగైన సైబర్ ప్రపంచ దిశగా!
హ్యాక్ అయిన సమాచారాన్ని రిపోర్ట్ చేయాలంటే..
https://www.facebook.com/hacked
నకిలీ సమాచారం గురించి రిపోర్ట్‌కు...
https://www.facebook.com/help/572838089565953?helpref=search&sr=2&query=reporting%20false%20claims&search_session_id=f886d969d0ffdf65b717d0567986859f
మోసానికి సంబంధించిన సమాచారాన్ని ..
httpr://www.facebook.com/he p/174210519303259?rdrhc
రిపోర్ట్ చేయడం మంచిది.
Also read: Cyber Weapon: పెగసస్ స్పైవేర్‌పై కథనం ప్రచురించిన అమెరికన్ పత్రిక?
ఫేస్‌బుక్ మోసాలకు అడ్డుకట్ట
మీ భద్రతను కాపాడుకోవడానికి ఫేస్‌బుక్‌లో మీరు చేయగలిగేవి...
∙మీ ఫేస్‌బుక్ గోప్యతా సెట్టింగ్‌లను లాక్ చేయండి ∙రెండుకారకాల ఫోన్‌నెంబర్ ప్రమాణీకరణను ప్రారంభించండి ∙మీకు తెలియని వారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తిరస్కరించండి ∙వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కోసం అడిగే సందేశాలను పట్టించుకోవద్దు ∙మీకు పంపిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు ∙మీ లాగిన్ చరిత్రను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ∙బలమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి ∙ధ్రువీకరించబడిన బ్రాండ్ ఖాతాల నుండి మాత్రమే షాపింగ్ చేయండి ∙మీ పేరు మీద ఉన్న ఖాతాల కోసం క్రమం తప్పకుండా శోధించండి
Also read: The Global Risks Report 2022
మీ ఫేస్‌బుక్ పేజ్ బయట...
∙మీ పరికరం ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి ∙అన్ని అనుమానాస్పద ఇ–మెయిల్‌లను తొలగించండి ∙మీ అన్ని డిజిటల్ పరికరాల్లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్ స్టాల్ చేయండి ∙ఎరుకతో వ్యవహరించండి.
మీరు ఫేస్‌బుక్ స్కామ్‌కు గురైనట్లయితే ...
∙స్కామ్ గురించి ఫేస్‌బుక్‌కి నివేదించండి ∙పాస్వర్డ్ మార్చుకోండి ∙మీ బ్యాంక్ అకౌంట్లను ఎప్పుడూ తనిఖీ చేస్తూ ఉండండి ∙మీ ఆన్‌లైన్ చెల్లింపులను ఆపేయండి ∙మీ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఎవరైనా దొంగతనం చేశారా గమనించండి.
Also read: Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP