Skilling Programme: సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్న సంస్థ?
దేశీయంగా సైబర్ సెక్యూరిటీను కెరియర్‌గా ఎంచుకునే వారికోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ఆవిష్కరించింది. క్లౌడ్‌హ్యాట్, కీనిగ్, ఆర్‌పీఎస్, సినర్జిటిక్స్ లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది. ఈ ప్రోగ్రాం కింద 2022 నాటికి లక్ష మందికి పైగా శిక్షణనివ్వాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను రూపొందించారు.
సంసద్ టీవీలో మేరీ కహానీ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంపీ?
పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తేసేదాకా తాను సంసద్ టీవీలో వ్యాఖ్యాతగా చేయబోనని డిసెంబర్ 6న సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం సంసద్ టీవీలో ఆయన ‘ టు ది పాయింట్’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మేరీ కహానీ టీవీ షోలో ఇకపై తాను యాంకరింగ్ చేయబోనని శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రకటిచించిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన 12 మంది ఎంపీల్లో ప్రియాంక ఉన్నారు.
చదవండి: జన్ ధన్ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణా ప్రోగ్రాంను ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్
ఎక్కడ : భారత్
ఎందుకు : దేశీయంగా సైబర్ సెక్యూరిటీను కెరియర్‌గా ఎంచుకునే వారికోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్