PMJDY: జన్ ధన్ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతం?
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ)లో భాగంగా దేశంలో తెరచిన దాదాపు 44 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో 24.42 కోట్ల ఖాతాలు మహిళలకి చెందినవి. అంటే మొత్తం ఖాతాల్లో వీరి వాటా దాదాపు 55 శాతంగా ఉంది. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ డిసెంబర్ 6న లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. మంత్రి తెలిపిన అంశాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
- 2021 నవంబర్ 17వ తేదీ నాటికి దేశంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద లబ్దిదారుల సంఖ్య 43.90 కోట్లు. వీరిలో 24.42 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
- జన్ ధన్ స్కీమ్ కింద లబ్ది పొందిన వారిలో అత్యధికులు గుజరాతీయులు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1.65 కోట్లు. అయితే వీరిలో 0.84 కోట్ల మంది (51 శాతం) మహిళా ఖాతాదారులు.
పీఎంజేడీఐను ఎప్పుడు ప్రారంభించారు?
దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆర్థిక చట్రంలో వారిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది 2014, ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. జన్ ధన్ అకౌంట్లలో ఎటువంటి కనీస నగదు నిల్వనూ నిర్వహించాల్సిన అవసరం లేదు.
చదవండి: స్టార్టప్‌ల కోసం నీతి ఆయోగ్ ఆవిష్కరించిన రియాలిటీ షో?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జన్ ధన్ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య దాదాపు 55 శాతంగా ఉంది
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్