Amitabh Kant: స్టార్టప్‌ల కోసం నీతి ఆయోగ్ ఆవిష్కరించిన రియాలిటీ షో?
వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చేందుకు రూపొందించిన ప్రత్యేక రియాలిటీ షో ‘హార్సెస్ స్టేబుల్ – జో జీతా వహీ సికందర్’ ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆవిష్కరించారు. డిసెంబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ... స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. హెచ్‌పీపీఎల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (మిషన్ డైరెక్టర్) చింతన్ వైష్ణవ్, సునీల్ శెట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం
క్విక్ రివ్యూ :
ఏమిటి : హార్సెస్ స్టేబుల్ – జో జీతా వహీ సికందర్ పేరిట ప్రత్యేక రియాలిటీ షో ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్