IFSCA: ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం
![PM Modi](/sites/default/files/images/2021/12/06/modi-650x350-1638798581.jpg)
ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 3న ప్రారంభించారు. డిసెంబర్ 4వ తేదీ వరకు వర్చువల్ విధానం ద్వారా జరగనున్న ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజానీకానికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఫిన్‌టెక్ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సును భారత ప్రభుత్వ ఆధ్యర్యంలో గిఫ్ట్ సిటీ, బ్లూమ్‌బెర్గ్‌ల భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) నిర్వహిçస్తుంది. ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లు కూడా సదస్సులో భాగస్వాములుగా ఉన్నాయి. ఫిన్‌టెక్ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ప్రతిపాదిత డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లుల విషయంలో భారత్ సరైన విధానాలే పాటిస్తోందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సదస్సులో వ్యాఖ్యానించారు.
చదవండి: కరెంట్ అకౌంట్ లోటు అంటే?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫినిటీ ఫోరం సదస్సు–2021 ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఫిన్‌టెక్ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్