Skip to main content

Fifth Strongest Economy: ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

2022 మార్చి చివరి నాటికి  భారత్‌ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది.
India overtakes U.K. to become fifth largest economy in the world
India overtakes U.K. to become fifth largest economy in the world

అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే  జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు బ్రిటన్‌ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్‌ డాలర్లు ఉంటే, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్‌ పౌండ్‌ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్‌ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది  7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్‌ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్‌ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు.

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Sep 2022 06:56PM

Photo Stories