Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 6, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 6th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 6th 2023  Current Affairs

Family Doctor: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. 
గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ ప్రారంభించారు. అక్టోబర్ 21, 2022 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది.  
ఏమిటీ విధానం?
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్‌కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్‌ విధానం లక్ష్యం. పూర్తి వివరాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం

ICC ODI Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో శుబ్‌మన్‌ గిల్‌.. 
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఏప్రిల్ 5న‌ విడుదల చేసిన బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ ఒక స్థానం పురోగతి సాధించి ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన విరాట్‌ కోహ్లి ఆరో ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హాజిల్‌వుడ్‌, కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అతనికంటే ముందున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 బ్యాటర్లలో అగ్రస్థానంలో, ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Koneru Humpy: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపికి ఆరో స్థానం
అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో ఏప్రిల్ 5వ తేదీ జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరి గిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.     

Sanjita Chanu: వెయిట్‌లిఫ్టర్‌ సంజితపై నాలుగేళ్ల నిషేధం

Sudhir Naik: భారత మాజీ క్రికెటర్‌ సుధీర్‌ నాయక్‌ మృతి 
భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్, వాంఖెడే స్టేడియం క్యూరేటర్ సుధీర్‌ నాయక్(78) ఏప్రిల్ 5న మృతి చెందారు. ముంబైకి చెందిన సుధీర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్‌ గావస్కర్, అజిత్‌ వాడేకర్, దిలీప్‌ సర్దేశాయ్, అశోక్‌ మన్కడ్‌లాంటి స్టార్స్‌ జట్టుకు అందుబాటు లో లేని సమయంలో సుధీర్‌ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్‌లో రంజీ చాంపియన్‌గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్‌ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు.  

Virat Kohli: ఐపీఎల్‌లో కొహ్లి రికార్డు.. తొలి భార‌తీయ‌ క్రికెటర్‌గా..

Lifetime MCC Membership: మిథాలీ, ధోని, యువరాజ్‌లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం 
క్రికెట్‌ నియమావళికి కేంద్ర బిందువైన విఖ్యాత మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) 17 మంది మేటి క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం కల్పించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌   నుంచి వీడ్కోలు తీసుకున్న భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్, పేస్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామిలతోపాటు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనాలకు ఈ గౌరవం దక్కింది. ధోని నాయకత్వంలో భారత్‌ 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ సాధించింది. 
యువరాజ్‌ సింగ్‌ ఈ రెండు గొప్ప విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సురేశ్‌ రైనా తన 13 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 7,988 పరుగులు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అత్యధిక మ్యాచ్‌ల్లో (155) కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గానూ ఆమె గుర్తింపు పొందింది. జులన్‌ వన్డేల్లో అత్యధిక వికెట్లు (255) తీసిన బౌలర్‌గా ఘనత వహించింది.  

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

MediaOne Channel: వార్తా చానల్‌ ‘మీడియావన్‌’పై నిషేధం ఎత్తివేత
మలయాళ వార్తా చానల్‌ ‘మీడియావన్‌’పై దేశ భద్రతా కారణాలతో గతేడాది కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 5న‌ రద్దు చేసింది. నిజానిజాలు సరిచూసుకోకుండానే నిషేధాజ్ఞలు అమలుచేశారంటూ కేంద్ర హోం శాఖను తప్పుబట్టింది. మీడియాపై అకారణంగా నిషేధం అమలుచేస్తే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధాన్ని సమర్తిస్తూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలుచేసింది. 
‘ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత ప్రధానం. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికొస్తారు. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామ్యం సరైన పథంలో ముందుకు సాగుతుంది. ఏకధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయి. ఛానెల్‌ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమే’ అని అభిప్రాయపడింది. 

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
నిషేధానికి కారణాలను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు మాత్రమే తెలియజేయడం సహజ న్యాయసూత్రాన్ని ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ అన్నారు. మీడియావన్‌ వార్తలను తప్పుబడుతూ భద్రతా కారణాలతో 2022 జనవరి 31న కేంద్రం దానిపై నిషేధం విధించింది. చానల్‌ దాన్ని కేరళ హైకోర్టులో సవాలు చేయగా కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దాంతో చానల్‌ సుప్రీంను ఆశ్రయించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Padma Awards 2023: పద్మ అవార్డులు ప్రదానం చేసిన ద్రౌపదీ ముర్ము 
గ‌ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 5వ తేదీ వీటిని ప్రధానం చేశారు. 
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి, చినజీయర్ స్వామి పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. 
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్‌, బాలీవుడ్ నటి రవీనా టాండన్ ద్రౌపది, ఖాదర్‌ వలీ, నాగప్ప గణేశ్‌ కృష్ణరాజనాగర్, అబ్బారెడ్డి నాగేశ్వరరావు త‌దిత‌రులు ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.

☛ Padma Awards 2023: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్‌’ తొలగింపు
దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. దేశానికి స్వాతంత్య్రం అనంత‌రం సంభ‌వించిన హిందు, ముస్లిం అల్ల‌ర్ల‌కు సంబంధించిన అంశాల‌ను పూర్తిగా తొల‌గించింది. హిందు, ముస్లింల మ‌ధ్య స‌యోధ్య కోసం మ‌హాత్మ గాంధీ చేసిన ప్ర‌య‌త్నాలు.. గాంధీ హ‌త్య‌, ఆ త‌ర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం, ఇటీవ‌ల జ‌రిగిన గోద్రా అల్ల‌ర్లు.. అల్ల‌ర్ల త‌ర్వాత చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లను 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి తొల‌గించింది. పూర్తి వివరాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

 వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

 

Published date : 06 Apr 2023 05:54PM

Photo Stories