PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
Sakshi Education
పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది.
మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్ 30, 2023 లోపు పాన్ -ఆధార్ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్ కార్డ్ పని చేయదని స్పష్టం చేసింది. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి.
☛ అంతేకాదు పాన్ కార్డ్ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి.
☛ పాన్ కార్డ్ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు.
☛ చట్టం ప్రకారం.. టీడీఎస్, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం/సేకరించడం జరుగుతుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Published date : 28 Mar 2023 06:25PM