Sanjita Chanu: వెయిట్‌లిఫ్టర్ సంజితపై నాలుగేళ్ల నిషేధం
Sakshi Education
డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత చాను నుంచి డోపింగ్ శాంపిల్స్ సేకరించారు. ఆమె శాంపిల్స్‌ను పరీక్షించగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్న డ్రోస్టానోలోన్ మెటాబోలైట్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సంజితపై ‘నాడా’ క్రమశిక్షణ ప్యానెల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల సంజిత పలు మెగా ఈవెంట్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సంజిత 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.
Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్ పేరు
Published date : 05 Apr 2023 05:48PM