Skip to main content

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే.. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌, ఓడితే మరో టీమ్‌‌‌‌ రంగంలోకి..

ఐపీఎల్ 2023 అభిమానులకు గంతంలో కంటే మ‌రింత కిక్‌ను ఇవ్వ‌బోతోంది.
IPL 2023

మార్చి 31 నుంచి జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ సీజన్‌లో బీసీసీఐ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. గ‌త ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో, గుజరాత్ జట్లను కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. 

టాస్ తర్వాతే తుది జట్టు..
ఇప్పటిదాకా 11 మంది జట్టు సభ్యులను టాస్‌‌‌‌‌‌‌‌కు ముందే ప్రకటించాల్సి ఉండే రూల్‌‌‌‌‌‌‌‌ను క్లాజ్‌‌‌‌‌‌‌‌ 1.2.1 ప్రకారం బీసీసీఐ మార్చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రిఫరీకి సమర్పించే 11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. అంతకుముందే జట్టును ప్రకటించినా సరే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను, ఓడితే మరో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు.

South Africa: టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అత్య‌ధిక‌ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా

మరోవైపు బౌలర్‌‌‌‌‌‌‌‌ నిర్దిష్ట టైమ్‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయకపోతే ఓవర్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించనున్నారు. ఈ పెనాల్టీ వల్ల 30 యార్డ్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వెలుపల నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి ఫీల్డర్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ అనవసరంగా/అనైతికంగా తమ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ మార్చుకుంటే ఆ బంతిని డెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించి ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధిస్తారు. ఈ ఐపీఎల్ నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి.

రెండు గ్రూపులుగా విడ‌దీసి..
గ‌త ఏడాది నుంచి ఐపీఎల్‌లోని జట్లను రెండు గ్రూపులుగా విడ‌దీస్తున్నారు. 2022 సంవత్సరం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా అన్ని జట్లకు సీడింగ్స్ ఉంటాయి. ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడేలా నిర్ణయించారు. లీగ్ స్టేజ్‌లో ఒక జట్టు తన గ్రూప్‌లోని నాలుగు జట్లతో పాటు మ‌రో గ్రూప్‌లోని సమాన స్థాయిలో ఉన్న వేరొక జట్టుతో రెండేసి మ్యాచులు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండేది. కానీ ఈ సీజన్‌లో ఒక గ్రూప్‌లోని జట్టు మ‌రో గ్రూప్‌లోని 5 జట్లతో రెండు మ్యాచ్‌లు, అదే గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ ‘ఎ’లో ఉన్న ముంబై జ‌ట్టు గ్రూప్ ‘బి’ లోని చెన్నై, సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, పంజాబ్‌, గుజరాత్‌ జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత గ్రూప్ ‘ఎ’లోని మిగతా జట్లు కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లక్నోతో త‌ల‌బ‌డుతుంది.

WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌ తొలి విజేతగా ముంబై ఇండియన్స్..  

5 పరుగుల జరిమానా..
బౌలర్‌ బంతి వేసేటప్పుడు ఫీల్డర్‌ లేదా వికెట్‌కీపర్‌ దురుద్దేశపూర్వకంగా కదిలితే ఫీల్డింగ్‌ జట్టుకు అయిదు పెనాల్టీ పరుగులు విధించి, డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోతే 30 యార్డ్స్ సర్కిల్ బయట అయిదుగురికి బదులు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. 

ఇంపాక్ట్ ప్లేయర్..
టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్ స్టిట్యూట్‌గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు. అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఇవ్వ‌రు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 29 Mar 2023 05:00PM

Photo Stories