Skip to main content

South Africa: టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. అత్య‌ధిక‌ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా

అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా కొత్త రికార్డు సృష్టించింది.
De Kock

మార్చి 26న‌ జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (46 బంతుల్లో 118; 10 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు వేగంతో 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అనంతరం సఫారీ టీమ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్‌ డి కాక్‌ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్‌డ్రిక్స్‌ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. దాంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా రికార్డు విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ఛేదన రికార్డు ఆ్రస్టేలియా (245/5) జట్టు పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్‌ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది.   

SA vs WI 2nd T20I

ఈ మ్యాచ్‌లో విండీస్‌-ప్రోటీస్‌ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్‌,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేశాయి.

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

Published date : 27 Mar 2023 05:25PM

Photo Stories