Skip to main content

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

ఆకాశమే హద్దుగా చెలరేగే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో తన చెత్త ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
suryakumar Yadav

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో తొలి బంతికే మిస్టర్ 360 సూర్య గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన సూర్య.. అష్టన్ అగర్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు. 

అత్యంత చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే.  ఇక ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.

అంతకుముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్‌లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్‌ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా అత్యధిక డకౌట్‌లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )

 

Published date : 23 Mar 2023 01:21PM

Photo Stories