Skip to main content

ICC Mens T20 Cricketer of the Year 2022 : ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా..

ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్‌ ప్లేయర్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి జ‌న‌వ‌రి 25వ తేదీన (బుధవారం) వెల్లడించింది.
Suryakumar Yadav
Suryakumar Yadav Ranking

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున ఎవరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది పలు కీలక మ్యాచ్‌లలో టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బ్యాటర్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా ఎదిగాడు.

Cricket: ఇండియా నుంచి తొలిప్లేయర్‌ ... స్కై తాజా రికార్డు ఏంటో తెలుసా.?

ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 68 సిక్సర్లు బాది.. పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో సూర్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. 189కి పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లండ్‌తో నాటింగ్‌హాం మ్యాచ్‌లో భాగంగా సూర్య తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకం బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు సూర్య.

2022 ఏడాది టీ20ల్లో సూర్యకుమార్‌ రికార్డులు.. suryakumar yadav t20 records

☛ వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్‌ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.
☛ శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్‌ రేట్‌తో 34 పరుగులు చేశాడు. 

☛ సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్‌ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
☛ ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్‌ రేట్‌తో 15 పరుగులు చేశాడు. 
☛ ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్‌ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.
☛ ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్‌ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది.
☛ న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది.
☛ బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్‌ రేట్‌తో 30 పరుగులు చేశాడు. 
☛ ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్‌ రేట్‌తో 6 పరుగులు చేశాడు. 
☛ హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్‌ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది.
☛ నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్‌ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది.
☛ పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్‌ రేట్‌తో 46 పరుగులు చేశాడు. 
☛ జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్‌ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూర్యకుమార్‌..
6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్‌ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసియా కప్‌-2022లో సూర్యకుమార్‌..
5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్‌ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్‌ సెంచరీ ఉంది.ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్‌ రికార్డుల్లోకెక్కాడు.

Published date : 25 Jan 2023 06:27PM

Photo Stories